టీడీపీ విజయానికి ఐపీఎల్ టీమ్ తో ఉన్న లింక్ ఏంటి..??

Suma Kallamadi
సోషల్ మీడియాలో క్రికెట్‌కి సంబంధించిన అంశాలను ఇతర విషయాలతో చాలామంది ముడి పెడుతుంటారు. ఐపీఎల్ లో ఒక టీమ్ గెలిచినప్పుడు అదే సమయంలో వేరొక ప్రత్యేకమైన సంఘటన జరిగినప్పుడు వాటి మధ్య ఏదో లింకు ఉందని అనుకుంటారు. ముఖ్యంగా పొలిటికల్ విన్స్ తో ఐపీఎల్ టీమ్‌ల విజయాలను లంకె పెడతారు. ఉదాహరణకి కేటీఆర్ ఈసారి ఇండియన్‌ క్రికెట్ టీమ్ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం, మేమూ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్ చేశారు కానీ ఈ సెంటిమెంట్ నిజం కాలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీ విజయాన్ని KKR విజయంతో ముడి పెడుతున్నారు.
వారి సిద్ధాంతం ప్రకారం, KKR తన IPL ట్రోఫీని 2014లో గెలుచుకుంది. మరోవైపు, బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులో ఉన్న తెలుగుదేశం సంస్థ అదే సంవత్సరం ఏపీ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఒక దశాబ్దం తర్వాత, 2024లో, KKR మళ్లీ IPL గెలిచింది, మళ్ళీ, ఈ సంవత్సరం ap ఎన్నికలు జరిగాయి. రిజల్ట్స్ తేదీ దగ్గర పడుతుంది. 2019లో చీలిక తర్వాత టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ మళ్లీ పొత్తు కుదుర్చుకున్నాయి.
KKR ఐపీఎల్ ని గెలుచుకున్న ఈ సంవత్సరం ఎన్నికల్లో TDP+ కూటమి కచ్చితంగా గెలుస్తుందని కొంతమంది ఓ సెంటిమెంట్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ+ కూటమి ఫాలోవర్లు KKR విజయమే తమ విజయానికి సూచన అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సిద్ధాంతాలు ప్రస్తుతానికి అభిమానులను, మద్దతుదారులను ఖుషి చేస్తున్నప్పటికీ.. ఏపీ ఎన్నికలలో టీడీపీ గెలుపు వైసీపీపై వ్యతిరేకత, టీడీపీ మానిఫెస్టోలపై ఆధారపడి ఉంటుంది.  ఏపీ ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు. మరి ఆ రోజు  మళ్లీ KKR, టీడీపీ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ టీడీపీ గెలిస్తే ఈ సెంటిమెంట్ నిజమని అందరూ నమ్మేస్తారు. సర్వేలలో చాలా వరకు వైసీపీ గెలుస్తుందని వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: