ప‌సుపు ద‌ళం: గ (గొ) ట్టిపాటి బుజ్జి... చంద్ర‌బాబుకు ఓ స్ట్రాంగ్ ఫిల్ల‌ర్‌...!

RAMAKRISHNA S.S.
- వైసీపీ స‌ర్కార్ టార్గెట్‌ త‌ట్టుకుని నిల‌బ‌డ్డ ధీరుడు
- ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ ఓ ఫైనాన్షియ‌ల్ హీరో
- ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎలా గెల‌వాలో తెలిసినోడే ఈ  ' ర‌వి '
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది.. ఎప్పుడొచ్చాం అన్న‌ది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇది బాపట్ల జిల్లాలోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు కరెక్ట్ గా సరిపోతుంది. తెలుగు రాజకీయాల్లో గొట్టిపాటి బుజ్జి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఒక తిరుగులేని హీరో. పార్టీలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా తిరుగులేని ఇమేజ్, క్రేజ్ సొంతం చేసుకున్న ఘనత రవికే దక్కుతుంది. చాలా చిన్న వయసులోనే 2004 లో ఎమ్మెల్యే ఆయిన రవి.. ఈరోజు అత్యంత ధుర్భేధ్య‌మైన రాజకీయ కంచుకోటను నిర్మించుకున్నారు.

చంద్రబాబు ఎన్నో సందర్భాలలో కనీసం కొన్ని నియోజకవర్గాలలో అయినా రవి లాంటి నేతలు ఉంటే.. నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని తోటి పార్టీ నేతలతో చెబుతూ ఉంటారు. ఒకరు నియోజకవర్గాల్లో వేలు పెట్టరు. తన పని చేసుకుపోతాడు. తన చుట్టుపక్కల ఉన్న పార్టీ నేతలకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చిన వెంటనే స్పందించి ఆదుకుంటారు. అలాగే సొంత పార్టీలోనే చాలామంది వెన్నుపోట్లు పొడుచుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. రవి అలాంటివి అస్సలు సహించరు. పైగా పార్టీ మారి కూడా జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రవిని ఎలాగైనా రాజకీయంగా.. ఆర్థికంగా అణ‌గ దొక్కాలని.. ఆయన వ్యాపారాలపై రకరకాల దాడులు చేయించినా మొక్కోవని ధైర్యంతో వాటిని ఎదుర్కొని తాను నిలబడడంతో పాటు.. ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఊపిరి లూదిన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. రవిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ తో మొదలుపెట్టి వైసీపీ వాళ్ళు ఎన్నో ఎత్తులు వేశారు. అలాంటి ఎత్తులకు రవి అస్సలు లొంగ‌లేదు. తాను టీడీపీలోకి వచ్చాను.. చంద్రబాబు గారిని నమ్మాను.. ఆయనతోనే చివరి వరకు నా రాజకీయ ప్రయాణం అని చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనా ఇటు ప్రజలతో ఎప్పుడు సత్సంబంధాలు నెరవేర్చటంలో మహా నేర్పరి రవి... అందుకే ఎప్పుడైనా..? ఎక్కడైనా..? ఏ పార్టీ నుంచి అయినా..? ఎలా గెలవాలో తెలిసినోడే ఈ రవి అని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: