ఒకప్పుడు చంద్రబాబుకు బద్ధశత్రువులు.. ఇప్పుడు జగన్‌పై కక్ష కట్టారే..?

Suma Kallamadi
ఏపీ 2019 ఎన్నికలలో 2.6 లక్షల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2024 ఎన్నికలలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయి రికార్డును సృష్టించాయి. ఈసారి ఏపీలో 80 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ల ఓట్ల సంఖ్య కూడా ఈసారి ఎవరు గెలుస్తారని ఆసక్తికరంగా మారింది.
గతంలో 2004లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు "ప్రజల వద్దకే పాలనా" వంటి కార్యక్రమాలను అమలు చేసేవారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పని చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసేందుకు ఫ్లాష్ చెక్‌అప్‌లు లేదా సడన్ ఇన్‌స్పెక్షన్లు చేసేవారు. ఇది ఉద్యోగులకు అస్సలు నచ్చక పోయేది కాదు. అందువల్ల అప్పటి సీఎం తమకు అనుకూలంగా లేరని ఉద్యోగులు బాగా భావించేవారు ఆ కారణం చేత నాయుడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. హాయ్ అన్న ఓడించేలాగా పనిచేశారు.
ఈ ఉద్యోగులు చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేయడానికి 2004 ఎన్నికలలో వృద్ధులు, శారీరక వికలాంగులను కూడా టీడీపీకి కాకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయమని ప్రోత్సహించారని గ్రౌండ్ లెవెల్ టాక్ కూడా ఉంది. 2004 ఎన్నికలలో ఓడిపోయినప్పుడు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా టీడీపీ ఓటమికి తామే కారణం అన్నట్లు గర్వంగా చెప్పుకున్నాయి.రాజకీయ విశ్లేషకుల ప్రకారం, 20 ఏళ్ల క్రితం చంద్రబాబుకు ఉద్యోగులు ఎలా వ్యతిరేకమయ్యారో ఇప్పుడు జగన్ కు అలా బద్ధ శత్రువులు అయ్యారట. 2024లో రికార్డు స్థాయిలో దాదాపు 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైయ్యాయి. వీరందరూ కూడా జగన్ పై కక్ష కట్టి మరీ ఈ రేంజ్ లో ఓట్లు వేశారని అంటున్నారు.
గత 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలకు జగన్ అన్యాయం చేశారనే భావనలో అందరూ ఉన్నారట. అందుకే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. పోలింగ్ తేదీన గొడవలు జరగడానికి ఈ ఉద్యోగులే కారణమని అంటున్నారు. టీడీపీ వాళ్లకు సహకరిస్తూ వాళ్ళు గెలిచేలాగా వీరు ప్రవర్తించారని కోరుకుంటున్నారు. 2004 తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఉద్యోగులు దించేయడానికి ప్రయత్నించడం ఇదే తొలిసారి అని, ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు విపత్కర ఫలితాలు తెచ్చిపెడుతుందని ఓ సీనియర్ పొలిటికల్ అనలిస్టు ఇటీవల తన ఒపీనియన్ వెల్లబుచ్చారు. అయితే ఉద్యోగుల వల్ల జగన్ కి ఏదైనా నష్టం జరుగుతుందా అనేది జూన్ 4వ తేదీన తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: