ఏపీ: విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్.. రామోజీరావుకు దెబ్బ..!

Divya
మీడియాలో తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న రామోజీరావు పత్రికా రంగంలో కూడా ఈనాడు పత్రికను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని దశాబ్దాలకు ఆయన తెలుగు రాజకీయాలను ఎక్కువగా శాసిస్తున్నారని చెప్పవచ్చు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన పోరాటం జరిపారు.ప్రస్తుతం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదంతా టిడిపికి సపోర్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు రామోజీరావు. ముఖ్యంగా వైఎస్ హయాంలో మార్గదర్శి చిట్స్ ఫండ్ సంబంధించిన కేసులో కూడ చిక్కుకోవడం జరిగింది.

వైసిపి కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు ఎంపీని అభ్యర్థిగా విజయ్ సాయి రెడ్డి పోటీ చేశారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఈనాడులో పలు రకాల కథనాలు కూడా వినిపించాయి. దీనిపైన విజయసాయిరెడ్డి సీరియస్ అవుతూ.. రామోజీరావు పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరిగింది. త్వరలోనే తాను కూడా మీడియా రంగంలోకి అడుగు పెడతానంటూ వెల్లడించారు.. రామోజీరావును రాము అంటూ సంబోధిస్తూ అంతూ తేలుస్తానంటూ కూడా తెలియజేశారు. తన మీడియాతో డి కొడతానని ముల్లును ముల్లుతోనే తీస్తానంటూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి. అలాగే రామోజీరావు సిబిఐ ఎంక్వయిరీ కి కూడా సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు.

విజయసాయిరెడ్డి గతంలో కూడా మీడియాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా అందుకు తగ్గట్టుగా వేయలేదు. రామురుజీరావు పైన ఉన్న కోపంతో వ్యాపార కోణంలో మీడియాను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి సాక్షి దినపత్రిక ఛానల్ తో పాటు ఎన్టీవీ టీవీ9 మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి విజయ్ సాయి రెడ్డి మరొక కొత్త ఛానల్ ను ఏర్పాటు చేస్తారా ఉన్న మీడియా సంస్థలలోని ఒకటి టేక్ ఓవర్ చేసి నడుపుతారు అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా రామోజీరావుకు విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ తో కచ్చితంగా దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: