ఏపీ: వైసిపి- కూటమి.. 100 సీట్లలోపు గెలుస్తారా..?

Divya
దేశం మొత్తం ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చూస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఓటింగ్ పర్సంటేజ్ జరగడంతో పాటు.. టిడిపి జనసేన బిజెపి పార్టీ పొత్తుతో వైసీపీ పార్టీని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ఈనెల 13వ తేదీన పూర్తి అయింది. వచ్చే నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా వెలబడునున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరి లెక్కలను వారు తెలియజేస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైసిపి తెలుగుదేశం పార్టీ వాస్తు సినారియ ఎంత ఉంటుంది.. అంటే తెలుగుదేశం పార్టీ కూటమిగా లెక్కేసుకున్నది ఏమిటంటే.. తాము పోటీ చేసిన 144 సీట్లలో 70 కి తగ్గవని.. 90 నుంచి 100 గ్యారంటీ అని.. కూటమితో కలుపుకుంటే 120 కి పైగా వస్తాయని.. ఈ  బెస్ట్ గా తీసుకున్న 80కు తగ్గవని నమ్మకంతో ఉన్నారు. అలాగే జనసేనకు 15 తగ్గవని బిజెపికి ఐదు తగ్గవని నమ్మకంతో కూటమి ఉన్నది. అనే విధంగా లెక్క చెబుతున్నారు టిడిపి.

వైయస్సార్సీపి పార్టీ ఏం లెక్కేస్తోందని విషయానికి వస్తే.. వీరు కూడా 100 సీట్లకు తగ్గకుండా వస్తామని ధీమాతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే జిల్లాల లెక్కలు కూడా చెబుతున్నారు. 2014 ని కౌంట్ చేసుకుని మరి చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో అతి పరిమితంగా వచ్చింది.. అక్కడ ఖచ్చితంగా అయిదు సీట్లకు తగ్గవు అని.. కడపలో అప్పట్లో ఏడు సీట్లు వచ్చాయని.. అక్కడ అంతకు తగ్గవు అని.. రాయలసీమలోని 35 సీట్లకు తగ్గవని.. వైసీపీ లెక్క.. నెల్లూరులో 5కు తగ్గవాని లెక్క. అంటే ఇక్కడ 40 సీట్లు అని.. మిగతా చోట్ల మొత్తం కలిపితే కనీసం 40 సీట్లు అయినా రావా అని ధీమాతో ఉన్నారు. దీంట్లో విజయనగరం నుంచి 5 సీట్లు గ్యారెంటీ అని.. శ్రీకాకుళం నుంచి ఒక 5 గ్యారెంటీ. విశాఖపట్నం నుంచి 5 గ్యారంటీ. ఇక్కడ ఒక 15 వచ్చినట్టే. తూర్పుగోదావరి నుంచి ఒక 5. పశ్చిమగోదావరి నుంచి 5 మొత్తం మీద పాతిక సీట్లు వచ్చినట్టే అంటూ తెలుపుతున్నారు. ఆ తర్వాత కృష్ణ గుంటూరు జిల్లాలో ఐదు ఐదు సీట్లు లెక్క వేసుకున్న 35 సీట్లు వచ్చినట్లని తెలుపుతున్నారు. అలాగే ప్రకాశము ఇతర ప్రాంతాలలో కచ్చితంగా కొన్ని సీట్లు అయినా వస్తాయని లెక్కతో తెలుపుతున్నారు. 85 నుంచి 130 దగ్గర వరకు వస్తాయని ధీమాతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అటు వైసిపి పార్టీ కూటమి కూడా 100 లోపు సీట్లే అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: