వైసీపీకి షాక్‌...తాజా సర్వేలో కూటమికి 130 సీట్లు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరగగా... ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాలకు దృష్టిపెట్టారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ములు భావిస్తుంటే... కాదు వైసిపి మరోసారి అధికారంలోకి వస్తుందని వైసిపి కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఫలితాలు, పార్లమెంట్ రిజల్ట్స్ పై బెట్టింగులు కూడా చేస్తున్నారు నేతలు.
అయితే ఏపీలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి... ఇటీవల ప్రకటించి లండన్ వెళ్లిపోయారు. దీంతో వైసిపి క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే బిజెపి, తెలుగుదేశం అలాగే జనసేన కూటమి... తాజాగా మరోసారి సర్వే చేయించిందట. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈ సర్వే జరిగిందని సమాచారం. అయితే ఈ సర్వేలో తెలుగుదేశం కూటమికి 130 స్థానాల వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తేలిందట.
కేంద్ర బిజెపికి సంబంధించిన టీం ఈ సర్వే నిర్వహించిందని సమాచారం. ఇక ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 100 నుంచి 110 ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందట. అటు జనసేన, భారతీయ జనతా పార్టీలకు 18 నుంచి 20 ఎమ్మెల్యేలు దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అంటే ఓవరాల్ గా ఏపీలో తెలుగుదేశం కూటమి 120 నుంచి 130 స్థానాలను కైవసం చేసుకోనుందట.
ఇక పార్లమెంటు విషయానికి వస్తే... ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమికి 15 నుంచి 17 ఎంపీ స్థానాలు దక్కుతాయట. ఇందులో తెలుగుదేశం పార్టీ 10 నుంచి 12 ఎంత స్థానాలు గెలుచుకోనుందని సమాచారం. ఇందులో బిజెపి, జనసేన పార్టీలకు ఐదు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. తెలుగుదేశం కూటమికి ఓవరాల్ గా 17 ఎంపీ స్థానాలు వస్తాయన్నమాట. ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత కూటమి సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నారట.మరి ఈ సర్వే ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: