జ‌గ‌న్ సైన్యం: లేని సంస్థ‌ల‌కు స‌ల‌హాలు.. వీరో చిత్ర‌మైన స‌ల‌హాదారులు..!

RAMAKRISHNA S.S.
( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
సాధార‌ణంగా స‌ల‌హాదారులు అంటే.. ఉన్న సంస్థ‌ల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం.. వాటిని పురోభివృద్ధిలో ముం దుకు న‌డిపించ‌డం వంటివి ఉంటాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వాలు.. కొంద‌రు స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకుంటాయి. అయితే.. ఏపీలో చిత్రంగా లేని రెండు సంస్త‌ల‌కు ప్ర‌భుత్వం స‌ల‌హాదారుల‌ను నియమించుకుంది. వీటిలో ఇద్ద‌రు ఉన్నత విద్య‌ను అభ్య‌సించిన వారిని స‌ల‌హాదారులుగా నియ‌మించు కుంది. మ‌రి వారు ఏం చేశారో.. స‌ర్కారుకే తెలియాలి.

ఒక‌రు వి.ఎన్‌. భరత్‌రెడ్డి. వైసీపీతో సంబంధాలు ఉన్న నాయ‌కుడు. ఈయ‌న ఉన్న‌త విద్యావంతుడు కావ‌డంతో ఈయ‌న‌ను ఏవియేషన్ స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఏవియేష‌న్‌.. అంటే.. గ‌గ‌న‌త‌ల మార్గం. దీనికి స‌ల‌హాలు ఇచ్చేందుకు ఆయ‌న‌ను నియ‌మించారు. వాస్త‌వానికి ఏవియేష‌న్ అనేది రాష్ట్రాల ప‌రిధిలోని అంశం కాదు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం. దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ .. కూడా కేంద్ర‌మే చూస్తుంది. కానీ, ఏపీ స‌ర్కారు ఎందుకు ఈయ‌న‌ను నియమించిందో తెలియ‌దు.

మొత్తానికి ఏవియేష‌న్ స‌ల‌హాదారుగా ఉన్న భ‌ర‌త్‌రెడ్డి ఏనాడూ.. మీడియా ముందుకు వ‌చ్చింది లేదు. తాను చేసింది చెప్పుకొనే ప‌రిస్థితి కూడా లేదు. ఇక‌, మరో స‌ల‌హాదారు.. తుమ్మ‌ల లోకేశ్వ‌ర్‌రెడ్డి. ఈయ‌న ఏకంగా.. టెక్నిక‌ల్ ప్రాజ‌క్టుల‌కు స‌ల‌హాదారుగా ఉన్నారు. ఈయ‌న ప‌రిస్థితి కూడా ఇంతే. సాంకేతిక ప‌ర‌మైన ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏమీ లేవు. ఉన్నా.. ఐఐటీ.. ఐఐఎం వంటి సంస్థ‌లు చూసుకుంటాయి.

ఇవి కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిదిలో ఉంటాయి. కానీ, ప్ర‌భుత్వం మాత్రం.. వీరిని స‌ల‌హాదారులుగా నియ‌మించు కుంది. ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా విష‌యాల‌లో ఆలోచ‌న చేసి స‌ల‌హా దారుల‌ను ఎంపిక చేయ‌డంలో ఎంతో ఉన్న‌తంగా ఆలోచించింది. కానీ కొన్ని అంశాల‌కు స‌ల‌హా దారులు అవ‌స‌రం లేక‌పోయినా నియ‌మించింది. ఇక పైన చెప్పుకున్న వారు ఏం చేశారో.. ఏం స‌ల‌హాలు ఇచ్చారో.. వీరికే తెలియాలి.. స‌ల‌హాలు తీసుకున్న స‌ర్కారుకే తెలియాలి. ఇలాంటి వారివ‌ల్లే ప్ర‌భుత్వం ఇరుకున ప‌డింద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: