జ‌గ‌న్ సైన్యం: స‌ర్కారుకు అన్నీతానైన వైసీపీ స్టార్ హీరో ' స‌జ్జ‌ల‌ '

RAMAKRISHNA S.S.
- జ‌గ‌న్ ఉన్నా లేకున్నా అన్నీ చ‌క్క‌పెట్టే స‌జ్జ‌ల‌
- ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాల్లోనూ కీ రోల్‌
- రాజ‌కీయంగానూ పార్టీని ముందుకు న‌డిపించే కింగ్‌
( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )
విప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న ఫైర్ కారు. పేలిపోరు.. చాలా చ‌క్క‌గా హుందాగా.. వివ ర‌ణాత్మ‌కంగా.. సుతిమెత్త‌గానే స్పందిస్తారు.అలాగ‌ని ఆయ‌నేమీ.. విమ‌ర్శ‌ల నుంచి త‌ప్పించుకోరు. అ న్నింటికీ స‌మాధానాలు చెబుతారు. ఆయ‌నే ప్ర‌భుత్వానికి మొత్తంగా స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. వివాదాలు.. విమ‌ర్శ‌లే కాదు.. ప్ర‌భుత్వం తీసుకునే విధానప‌ర‌మైన నిర్ణ‌యాల వెనుక కూ డా స‌జ్జ‌ల ఉంటారు. స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల‌ను కూడా ఆయ‌న వెల్ల‌డిస్తారు.

స‌ర్కారుకు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ముఖ్య‌మంత్రి మాట్లాడ‌డం రివాజు. ఇది ఎక్క‌డైనా. రివాజు. అయితే. కేంద్రంలో ప్ర‌ధాని మోడీ, ఒడిశాలో సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ మాదిరిగా.. ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా..ఎప్పుడూ మీడియా ముందుకు రారు. వారైనా క‌నీసం..అవ‌స‌రం బ‌ట్టి మీడియా ముందుకు వ‌స్తారు. ఇక్క‌డ జ‌గ‌న్ అవ‌స‌రం ఉన్నా..లేకున్నా కూడా.. రారు. దీంతో మొత్తం వ్య‌వ‌హారం అంతా కూడా.. స‌జ్జ‌లే చ‌క్క‌బెడుతుంటార‌ని అంటారు. అందుకే.. ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లు వున్నాయి.

మంత్రివ‌ర్గ కూర్పు నుంచి.. తీసుకునే నిర్ణ‌యాల వ‌ర‌కు.. స‌జ్జ‌ల అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే కొంద‌రు ప్ర‌తిపక్ష నాయ‌కులు..ఆయ‌న‌ను స‌క‌ల శాఖ‌ల మంత్రిగా విమ‌ర్శిస్తుంటారు. ప్ర‌తిప‌క్షాల గురించి మాట్లాడ‌ల‌న్నా.. ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చే వార్త‌ల‌ను ఖండించాల‌న్నా.. కేంద్రం నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌లు... స‌మ‌స్య‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నా  స‌ర్వం స‌జ్జ‌లే అన్న‌ట్టుగా వ్య‌వ‌హారం న‌డుస్తుంది. స‌ర్కారులో నెంబ‌ర్ 2గా ఉండే స‌జ్జ‌ల ద‌య ఉంటే.. అన్నీ ఉన్న‌ట్టేన‌ని పార్టీ నాయ‌కులు కూడా భావిస్తుంటారు.

తాజాగా ఎన్నిక‌ల స‌మయంలో త‌లెత్తిన వివాదాల‌పైనా  స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌లే స్పందించారు. ఎన్ని క‌ల ఫ‌లితాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వ‌స్తాయో ఆయ‌నే చెబుతున్నారు. ప్ర‌స్తుతం సీఎం లేని నేప‌థ్యంలో ఈ బాధ్య‌త‌ల‌ను కూడా  ప‌రోక్షంగా స‌జ్జ‌లే చూస్తున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా స‌జ్జ‌ల అటు స‌ల‌హాదారుగానే కాకుండా.. ఇటు రాజ‌కీయంగా కూడా.. పార్టీని ముందుకు న‌డిపిస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: