అచ్చెన్నాకు ఎసరు : టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌ ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో భారీ కుదుపు, మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పక్కకు పెట్టి... నారా లోకేష్‌ కు ఆ బాధ్యతలు ఇచ్చేలా కనిపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే.. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ ని పార్టీ అధ్యక్షుడుగా నియమించాలి.. ఇది నా డిమాండ్ అంటూ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలనానికి తెరలేపారు. నారా లోకేషును పార్టీ అధ్యక్షుడిగా చేయాలని  డిమాండ్ చేసే హక్కు నాకుందని వెల్లడించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడుగా నియమించాలని డిమాండ్‌ చేశారు నారా లోకేషుని అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.
అంతేకాకుండా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని...చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వరి డిసైడ్ చేస్తారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నస్పష్టం చేశారు. చంద్రబాబు ఆత్మ కధలో నాకో పేజీ ఉంటుందని... టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా నేను నిలబడ్డాను....పోరాటం చేయని వాళ్లు....బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.
మాకన్ని అర్హతలున్నా టిక్కెట్లు రాలేదు....పిన్నెల్లి మాపై దాడి చేయించారన్నారు. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవికి పిన్నెల్లి వేలం పాట పెట్టారని...పిన్నెల్లిని షూట్ చేసినా తప్పులేదని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి ఖాయమని డిసైడ్ అయిన కొందరు వైసీపీ నేతలు విదేశాలకు చెక్కేశారు....వాళ్లు కౌంటింగ్ కి కూడా రారన్నారు. రెడ్ బుక్ లో పిన్నెల్లి పేరుందని కూడా బాంబ్‌ పేల్చారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. అయితే..టీడీపీ అధ్యక్షుడి మార్పు గురించి టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అచ్చెన్నాయుడికి పదవి గండం మొదలైందని అంటున్నారు. మరి దీనిపై బాబు ఎలా ముందుకు వెళతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: