విశాఖ: జగన్ వైపే తెలుగు తమ్ముళ్లు.. అసలు రీజన్ ఇదే..!

Divya
వైసీపీకి రాజధాని అంటే కచ్చితంగా విశాఖపట్నం అని చాలామంది మక్కువ చూపుతున్నారు. ఈ విషయాన్ని వైసిపి పార్టీ నేతలు ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ గెలుస్తుందని కచ్చితంగా జగన్ ప్రమాణస్వీకారం కూడా విశాఖ వేదికగానే చేస్తామంటూ తెలియజేశారు. టిడిపి పార్టీ మాత్రం గతంలో తమ రాజధానిగా అమరావతి ప్రకటించామంటూ ఎన్నోసార్లు తెలియజేశారు. కానీ ఇప్పుడు  విశాఖ మీద టిడిపి కూడా ఇప్పుడు మోజు పెంచుకుంటోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలో ఉండవలసిన నాయకులు నెల్లూరులో ఉండవలసిన తదితర నాయకులు ఒక సారిగా విశాఖ మీద దండయాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

పోలింగ్ ముగిసిన వెంటనే విజయవాడకు చెందిన బోండా ఉమా కూడా విశాఖకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మేము గెలుస్తున్నాము అన్నట్లుగా తెలియజేశారు. ఆ తర్వాత వరుస పెట్టి టిడిపి నేతలు విశాఖ కు చేరుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి, అలాగే రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విశాఖకు వచ్చి మరి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరింతమంది నేతలు విశాఖకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

విశాఖ నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయాలని టిడిపిలో కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. దీంతో ఏపీలో రాజధానిగా ముద్ర పడిపోయిన విజయవాడను దాటి ఇప్పుడు ఏకంగా విశాఖకు రాజకీయం షిఫ్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ మొదటి నుంచి చేస్తున్న ఈ పనిని ఇప్పుడు టిడిపి నేతలు చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో విశాఖ మెగ సిటీ అవ్వడం ఖాయమని తెలుగు తమ్ముల నోట కూడా వస్తోంది. విశాఖ చుట్టి రాజకీయం చేస్తూ టిడిపి నేతలు. మరి జూన్ 4వ తేదీన తరువాత ఎవరు ఎక్కడ ప్రమాణస్వీకారం చేస్తారనే విషయం తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: