వైసీపీ Vs టీడీపీ: ఉత్తరాంధ్ర ఓట్లు ఏ పార్టీకి రాలతాయి?

Purushottham Vinay
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలనేవి ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 19 ఇంకా శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.  జూన్ 4వ తేదీన రానున్న ఫలితాలలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సమాచారం తెలుస్తోంది. అక్కడ 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టిడిపి గెలుచుకుంది. అందుకే అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో వైసిపి అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోందని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. విశాఖ రాజధాని, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని వైసిపి ఎంతో ఆశతో ఉంది.ఇక గత 2019 ఎన్నికల్లో 34 స్థానాలకు గాను.. వైసిపి 28 చోట్ల విజయం సాధించింది. టిడిపి మాత్రం కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.


విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతానే తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి సీట్లు తగ్గడం ఖాయమని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.2014లో టిడిపికి మొత్తం 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిని అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు.


విశాఖ జిల్లాలో జనసేన తో పొత్తు టిడిపికి మైనస్ కానుందనే తెలుస్తుంది.ఎందుకంటే బలమైన టీడీపీ నేతలను కాదని చివరలో జనసేన నాయకులకు టిక్కెట్ కేటాయించడంతో కూటమికి చాలా మంది నేతలు దూరమయ్యారు.ఇది ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు ఇవ్వనుంది.గత ఎన్నికల్లో విశాఖ నగరంలోని కేవలం 4 నియోజకవర్గాలకు మాత్రమే టిడిపి పరిమితం అయింది.అప్పుడు అందులో ఇప్పుడు ఒక్కటి మాత్రమే ఆ పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇక విజయనగరం జిల్లాలో అయితే గత ఎన్నికల్లో వైసిపి వైట్ వాష్ చేసింది. ఏకంగా 9 నియోజకవర్గాలను గెలుచుకుంది. అయితే ఈసారి టీడీపీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది.


ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను ఖచ్చితంగా గెలిచి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తపరుస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే తెలుగుదేశం పరిమితం అయ్యింది. ఈసారి ఆ రెండు కూడా వైసీపీ ఖాతాలోకి వచ్చేస్తాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: