రెంటికీ చెడ్డ వైసీపీ పిన్నెల్లి... జ‌గ‌న్ ఇచ్చే సినిమా ట్విస్ట్ ఇదే..!

RAMAKRISHNA S.S.
మాచ‌ర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి వ్య‌వ‌హారం.. వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆయ‌న ఎన్నిక‌ల పోలింగ్ రోజు వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఇటు పార్టీ, అటు ఆయ‌న ఇద్ద‌రూ.. కూడా కుంప‌ట్లో ప‌డిన ట్టు అయింది. ఎలానూ పిన్నెల్లిని అరెస్టు చేయ‌డం ఖాయం. పైగా బెయిల్ కూడా ల‌బించ‌ని కేసుల్లో ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించ‌డం ఖాయం. వీటితోపాటు.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేసినా.. వేయొచ్చ‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఇదే జ‌రిగితే.. వ‌చ్చే ఆరు సంవ‌త్స‌రాల పాటు.. ఆయ‌న పోలింగ్‌కు దూరంగా ఉండాలి. ఒక‌వేళ రేపు ఎన్ని క‌ల ఫ‌లితం వ‌చ్చినా.. పిన్నెల్లి గెలిచినా.. దానిని ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు కూడా చేయొచ్చు. మ‌రోవైపు.. ఈవీఎంల ధ్వంసం కేసు. ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలు ఇన్ని ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. పిన్నెల్లి వివాదం.. పీక‌ల వ‌ర‌కు వ‌చ్చేసింది. ఇదిఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్నాయి. మ‌రోవైపు.. ఆయ‌న పార్టీ వైసీపీకి కూడా.. ఈ ప‌రిణామాలు ఇబ్బందిగానే మారాయి.

ఇప్ప‌టికే.. వైసీపీ సంఘ విద్రోహ వ‌క్తుల‌కు అడ్డాగా మారింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు ప్ర‌తిప క్షాలు చేసే విమ‌ర్శ‌లు మ‌రింత‌గా పెరిగాయి. ఏం జ‌రిగింద‌నే విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌త్య‌క్ష సాక్ష్యంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు మాత్రం పిన్నెల్లిని దోషిని చేస్తున్నాయి. దీంతో ఈ ప‌రిణామం నుంచి వైసీపీ బ‌య‌ట ప‌డే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు.. పిన్నెల్లిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్లు కూడా.. వ‌స్తున్నాయి. పిన్మెల్లి తీరుతో పార్టీ అధినేత జ‌గ‌న్ కు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డిన‌ట్ల‌య్యింది.

ఇప్ప‌టి వ‌రకు పార్టీలో అనంత‌బాబు వ్య‌వ‌హారం.. తీవ్ర ఇబ్బంది పెట్టింది. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు ద‌ళిత యువ‌త శిరోముండ‌నం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్య‌వ‌హారం కూడా.. వైసీపీని ఇరుకున పెట్టింది. ఇక‌, ఇప్పుడు పిన్నెల్లి వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇవ‌న్నీ.. పైకి క‌నిపిస్తున్న‌వి. మ‌రి క‌నిపించ‌ని చాలానే ఉన్నాయ‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో పిన్నెల్లిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయొచ్చ‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: