రేవంత్ షాకింగ్ డెసిషన్.. TSRTC పేరు మార్పు?

praveen
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ నుంచి టీజీగా మారుస్తాము అంటూ హామీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ హామీని నిలబెట్టుకుంటూ ఇటీవల ఇక టీఎస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం పేరును టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఇదే పేరుతోనే ప్రస్తుతం అన్ని సంస్థలు కార్యకలాపాలు  సాగిపోతున్నాయి అని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరు విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కారు.

 ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీగా కొనసాగుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును ఇక టీజీఎస్ ఆర్టీసీగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థ ఎండి సజ్జనార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇక రోడ్డు రవాణా సంస్థకు చెందిన సోషల్ మీడియా ఖాతాలన్నింటి పేరును కూడా టీజీఎస్ ఆర్టీసీగా మార్చేశారు. అయితే ఇది మాత్రమే కాదు విద్యుత్ సంస్థలైన టీఎస్ జెన్కో సైతం టీజీ జెన్కోగా మార్చేశారు. టీఎస్ ట్రాన్స్ కో సైతం టీజీ ట్రాన్స్ కో గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే ఇలా టీఎస్ గా ఉన్న పేరును టీజీగా మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై ఇక అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 సంక్షేమ పాలన కొనసాగిస్తారని.. ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తే ఇలా రాష్ట్రం పేరును మారుస్తున్నారని.. ఈ పేరు మార్పు కారణంగా వచ్చే ఉపయోగం ఏమీ లేదు అంటూ బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీ ఇచ్చిన విధంగానే అటు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మహాలక్ష్మి అనే పథకాన్ని అమలుచేసి మహిళలకు జీరో టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: