పవన్ లేకుంటే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే?

Purushottham Vinay
వాస్తవానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో టీడీపీకి బ్యాక్ బోన్ లా నిలిచారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. టీడీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఏకంగా జైలులోకి వెళ్ళి మరీ బాబుని పరామర్శించి వచ్చారు.ఆ వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని సంచలన ప్రకటన చేశారు. అలా పవన్ టీడీపీకి ఇచ్చిన  సపోర్ట్ ని వెలకట్టడానికి తూకం వేయడానికి కూడా ఏ ఒక్కటీ సరిపోదు అనేది ముమ్మాటికీ వాస్తవం. అసలు పవన్ వల్లనే టీడీపీకి లెక్కలేని బలం వచ్చింది. పవన్ ప్రసంగాల వల్లనే కూటమిలో ఎంతో ఊపు కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ అనే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, క్రౌడ్ పుల్లర్, టాలీవుడ్ హీరోగా ఫుల్ గ్లామర్ ఉన్న నేత టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడడంతో గత ఏడాది అక్టోబర్ నుంచే టీడీపీ జోరు వేరే లెవెల్ లోకి వెళ్ళిపోయిందనే విషయం ముమ్మాటికీ వాస్తవం.ఇక ఈసారి ఎన్నికలలో టీడీపీ జనసేనతో జట్టు కట్టి బీజేపీని తమతో కలుపుకోని వైసీపీ అనుకూల ఓట్లను షర్మిల ద్వారా చీల్చే ప్రయత్నం చేసింది.

ఇంకా కామ్రేడ్స్ బయట ఉన్న బాబు క్షేమం కోరుకునేవారుగా చేసుకుంది. అలాగే ఎన్నారైలను దగ్గరకు తీసుకుంది. వ్యతిరేక ఓట్లు అనేవి అసలు పోకుండా చూసుకుంది. ఇంత చేసినా కూడా వైసీపీతో హోరా హోరీ పోరు అన్నది.. పోలింగ్ తరువాత ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. ఈ రోజుకీ కూడా పవన్ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇచ్చినా కూడా ఇంకా వైసీపీకి గెలిచే చాన్స్ ఉంది అనే బలమైన సర్వేలూ వస్తున్నాయి.టీడీపీ ఒంటరి పోరాటం చేసి ఉంటే కనుక ఈసారి ఎన్నికల్లో  పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పవన్ లేకపోతే టీడీపీ పరిస్థితి అస్సాం అయ్యుండేది. అసలు పవన్ కళ్యాణ్  మద్దతు లేకుండా ఉంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు అనేది ముమ్మాటికీ వాస్తవం.టీడీపీ పాలనలో మంచిగా చెప్పుకునేందుకు అసలు ఏది లేదు. జగన్ ఎన్నికల సభలలో ప్రశ్నించినట్లుగా తన పద్నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క మైలు రాయి లాంటి పని ఏమైనా ఉందా అంటే లేదు అనే తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో గట్టి అండ టీడీపీకి దొరికింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: