వైసిపి: ఫ్యాన్ గాలి స్పీడుకు.. సైకిల్ కొట్టుకుపోయే..!

Divya
ఎన్నికలకు  కచ్చితంగా రెండు మూడు నెలల ముందు నుంచే ఎల్లో మీడియా చేసిన హంగామా ప్రస్తుతం చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కూటమికే ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే వాటికి మించి వైసిపి పార్టీ మించిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వైసిపి, కూటమి మధ్య సోషల్ మీడియాలో ఎలక్షన్ ముందు వరకు ఒక పెద్ద వార్ జరిగింది.. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్, సామాజిక పింఛన్ల విషయంలో, అలాగే నవరత్నాల పథకాల విడుదల డబ్బుల విషయంలో కూడా కూటమిని దోషిగా నిలబెట్టేందుకు వైసిపి విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చంద్రబాబు పవన్ రెచ్చిపోయి ఎన్నో సందర్భాలలో చాలా దురుసుగానే మాట్లాడారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద చాలామంది టీడీపీ నేతలు మద్దతిచ్చిన వీడియోలను అలాగే ఈటీవీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గతంలో ప్రచారం చేసిన పాజిటివ్ కథనాలను సైతం వైసీపీ సోషల్ మీడియా బయటకు తీసి కూటమిని ఒక ఆట ఆడుకుంది. అలాగే వాలంటరీ ద్వారా పింఛన్లు పంపిణీ అడ్డుకోవడంతో ఇది టిడిపి పని అంటూ వైసీపీ ఆధారాలతో సహా బయట పెట్టింది.ముఖ్యంగా నిమ్మగడ్డ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ అసలు విషయం వైసీపీ సోషల్ మీడియా బయటపెట్టింది.

ఇలా కొన్ని వాటిలో కూటమికి, వైసిపి సోషల్ మీడియా ఏకంగా చుక్కలు చూపించడంతో రాజకీయంగా టిడిపి పార్టీకి నష్టం జరిగింది. ఎల్లో పత్రికా చానల్స్ సైతం టిడిపిని ఎంత జాకీలు పెట్టి పైకి లేపాలన్న నానా తంటలు పడ్డారు. అలాగే ఈ ఎన్నికలలో తమ పార్టీదే విజయమంటూ టిడిపి పార్టీ పెద్ద ఎత్తున బెట్టింగ్ పేరుతో ఒక మైండ్ గేమ్ కూడా ఆడింది. దీంతో వైసిపి పార్టీ కాస్త ఆత్మ రక్షణలో పడ్డారు.. కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ గురి చూసి ఎల్లో బ్యాచ్ కు ఒక చావు దెబ్బ వేశారు.. ఐప్యాక్ టీం తో మాట్లాడుతున్నప్పుడు 151 పైగా సీట్లు వస్తాయని ఈ ఎన్నికలు దేశమంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయంటూ ప్రకటించారు.

ఇలా ప్రకటించడంతో ఒక్కసారిగా ఎల్లో టీమ్ కలవరపడడం జరుగుతోంది. అలాగే జూన్ 9న జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం విశాఖలో చేస్తారంటూ బోత్స్ ప్రకటించారు.. దీంతో మరోసారి టిడిపి మరొకసారి ఆత్మ రక్షణలో పడిపోయింది. టిడిపి మైండ్ గేమ్ కి ఇలా చెక్ పెట్టింది వైసిపి పార్టీ. మొత్తానికి మరొకసారి ఫ్యాన్ గాలి స్పీడుకు సైకిల్ కొట్టుకుపోయేలా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటివరకు చాలా సర్వేలు కూడా వైసిపి పార్టీని విజయాన్ని అందుకుంటుందని విధంగా తెలియజేస్తున్నాయి.. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: