నల్ల డబ్బుని పేదలకు పంచుతానంటున్న మోడీ?

Purushottham Vinay
ఎన్నికల సమయంలో నల్ల డబ్బు, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం కచ్చితంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారతాయనే కామెంట్స్ చాలా బలంగా వినిపిస్తుంటాయి. అయితే ఆ సంగతి పక్కన బెడితే ...అవినీతి కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల కట్టల గుట్టలపై ప్రధాన మంత్రి మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక ఎన్నికల వేళ కచ్చితంగా విదేశాల్లో ఉన్న బ్లాక్ పేదలకు పంచడం అనే విషయాన్ని మోడీ & కో హైలైట్ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ప్రధాని మోడీ... కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన అన్నారు.ఇంకా ఇదే క్రమంలో... తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర దర్యాప్తు సంస్థలు సమర్థంగా పనిచేయడం ప్రారంభించాయని తెలిపిన ప్రధాని మోడీ... అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.


ఇందులో భాగంగా... ఆ సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు మోడీ తెలిపారు.ఈ సందర్భంగా కామెంట్స్ చేసిన ప్రధాని... గత ప్రభుత్వాల హయాంలో కొంతమంది వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా కూడా తిరిగి పేదలకు చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికోసం గాను న్యాయబృందం సలహా కోరుతామని.. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని కూడా చెప్పుకొచ్చారు.ఇంకా ఇదే క్రమంలో... ఎన్డీయే కూటమి మొత్తం 400 సీట్లు సాధిస్తుందంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయాన్ని ప్రస్థావించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ... 400 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ప్రజలే తమలో విశ్వాసం నింపారని అన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసని.. 2019 ఎన్నికల నుంచే తమ కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉందని.. ఈసారి 400 మార్క్‌ దాటాలని తమ నేతలకు చెప్పామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: