చంద్రబాబు గాలి తీసేసిన టీడీపీ నేత.. ఈ కామెంట్ల గురించి బాబు రియాక్ట్ అవుతారా?

Reddy P Rajasekhar
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఎన్నికలు పూర్తైన తర్వాత బాబుకు భారీ షాకులిచ్చిలా కామెంట్లు చేస్తున్నారు. విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కూటమి విశాఖ నార్త్ తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలలో ఓడిపోతుందని గండి బాబ్జీ అన్నారు.
 
విశాఖ టీడీపీ కార్యాలయం వేదికగా ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్లు చేయడం జరిగింది. విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన గెలిచే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని గండి బాబ్జీ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి అనుకూల ఫలితాలు రాలేదు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విశాఖలో మాత్రం ఆ పార్టీ కోరుకున్న ఫలితాలు రాలేదు.
 
అయితే ఈ ఎన్నికల్లో విశాఖలో వైసీపీ పుంజుకుందని గండి బాబ్జీ కామెంట్ల ద్వారా క్లారిటీ వచ్చేసింది. గండి బాబ్జీ మాటలు చంద్రబాబు వింటే ఎలా రియాక్ట్ అవుతారో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని షాకులు తప్పవంటూ కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కుప్పంలో బాబుకు ఓటమి తప్పదంటూ వైసీపీ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
వైసీపీ అనుకూల మీడియా కుప్పంలో కోట్లు కుమ్మరించినా బాబుకు అనుకూల ఫలితాలు రావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రానుందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆ పార్టీ మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితులు కల్పించేలా సొంత పార్టీ నేతలే కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ నేతల కష్టాలు మామూలుగా ఉండవని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమికి ఈ ఎన్నికల్లో గెలుపు సులువు అయితే కాదని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: