వైసీపీ Vs టీడీపీ: ఏ కులం నుంచి ఎన్ని ఓట్లు రాలాయంటే?

Purushottham Vinay
•వైసీపీ టీడీపీకి ప్రధానంగా మారిన కుల ఓట్లు

•BC, SC, st నుంచి వైసీపీకి భారీ ఓట్లు

•ఓట్లలో టీడీపీపై పైచేయి సాధించిన వైసీపీ


ఇండియా హెరాల్డ్ - ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎన్నడూ లేని ఘనంగా భారీ శాతంతో పూర్తయ్యింది. మే 13వ తేదీ  ఉదయం 7 గంటలకు ఓటింగ్  మొదలవ్వగా..వేల సంఖ్యలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి ఓట్లు వేశారు. కొన్ని పోలింగ్ బూతుల్లో  ఓటర్ల జాతరతో పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లని చూస్తే తిరనాళ్ల సందడి  నెలకొంది. పోలింగ్ వద్ద క్యులు భారీగా ఉన్నాయి.  పురుషులు కంటే స్త్రీలే ఎక్కువగా ఓట్లు వెయ్యడం విశేషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని  ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు వైసీపీకి పడ్డాయాని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా తేలింది. ఇక రాజకీయాల్లో కుల ఓట్లు అనేవి ఎంతో ప్రధానమైనవి. అలా ఏ కులం వారు ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక టీడీపీకి కమ్మ కులం వారు వైసీపీకి రెడ్ల కులం వారు భారీగా ఓట్లు వెయ్యడం తెలిసిందే. ఎందుకంటే అవి తమ సొంత కులాల నేతల పార్టీలు కాబట్టి ఓట్లు పడటం సహజం.ఇక వేరే కులాల నుంచి ఎంత శాతం ఓట్లు పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక నాయుడ్లు ఎక్కువగా దాదాపు 80 శాతం దాకా జనసేనకు, టీడీపీకి వేశారు. ఇంకో 20% వైసీపీకి ఓట్లు పడ్డాయి. అలాగే అత్యంత కీలకమైన bc, SC, st, మైనారిటీ ఓట్లు మాత్రం వైసీపీకే బాగా పడ్డాయి. ఎందుకంటే ఆ కులాల్లో పేదవాళ్ళు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లకి జగన్ చేసిన మేలు అంతా ఇంత కాదు కాబట్టి వాళ్ళ నుంచి  90% శాతం వైసీపీకి ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. మాల కులం వారి నుంచి 90% ఓట్లు వైసీపీకి పడగా మిగిలిన 10% టీడీపీకి పడ్డాయి. మాదిగ కులం వారి ఓట్లు 70% వైసీపీకి పడగా 30% టీడీపీకి పడ్డాయి. st, bc లోని కొన్ని కులాల వారు, ముస్లిం మైనారిటీ కులాల వారి ఓట్లు వైసీపీకి 70 % శాతం పడగా.. టీడీపీ కూటమికి 30% శాతం పడ్డాయి. ముఖ్యంగా bc నుంచి యాదవులు భారీగా వైసీపీకి ఓట్లు వేశారు. ఇలా వైసీపీకి టీడీపీకి పోలైన ఓట్లు ప్రకారం వైసీపీ ముందంజలో ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. కాబట్టి ఈసారి వైసీపీ గెలిచి జగన్ సీఎం అవ్వడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: