ఛీ! ఓట్ల కోసం రౌడీయిజం చేస్తున్న టీడీపీ కూటమి?

Purushottham Vinay
రాజకీయ నాయకులు.. కొన్ని వర్గాలకు చెందిన ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అనేది ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయింది. అసలు ఈ ఓట్లను కొనుగోలు  చేయడాన్ని ఎవ్వరూ కూడా వింతగా చూడడం లేదు. తప్పుగా కూడా అస్సలు గుర్తించడం లేదు. ఏదో జనాల మీద బాధ్యతలు ప్రేమలు ఉన్నట్లు వేదికల మీద నుంచి మాట్లాడేప్పుడు.. ఓటను అమ్ముకుంటే భవిష్యత్తును అమ్ముకున్నట్టే..  మీరు ప్రశ్నించే హక్కు కోల్పోతారు.. లాంటి ఒట్టి మాటలు చెబుతారు తప్ప..ఏమి లేదు. అసలు ఈ ఓట్ల కొనుగోలు అందరూ ఆమోదించే వ్యవహారంగా మారిపోయింది.అయితే తమకు ఓట్లకు డబ్బు ఇవ్వలేదని అంటూ ప్రజలందరూ గుంపుగా నాయకుల ఇంటిమీదకు రావడం, నాయకుల కార్యాలయాలను ముట్టడించడం ఇంకా బెదిరించడం అవసరమైతే దాడి చేయించడం మనం ఎన్నడైనా గమనించామా? కానీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిణామాలు టీడీపీ కూటమి వర్గం నుంచి బాగా జరుగుతున్నాయి.పిఠాపురంలోను, విశాఖ తూర్పు నియోజకవర్గంలోనూ టీడీపీ కూటమి సెట్ చేసిన రౌడీలు సాధారణజనంగా మారి గుంపులుగా వైసీపీ అభ్యర్థులు ఇళ్లు, కార్యాలయాల మీదికి వెళ్లి తమకు డబ్బు అందలేదని గొడవ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.


అక్కడ స్థానికులతో సంప్రదించి.. అసలు విషయం ఆరాతీస్తే.. కూటమి పార్టీలకు చెందిన తెలుగుదేశం, జనసేన నాయకులే.. తమ పార్టీకి నమ్మకస్తులైన కొంతమంది రౌడీ వర్గాలవారినే ఎగదోసి ..వైసీపీ అభ్యర్థుల ఇళ్ల మీదకు వెళ్లి రాద్ధాంతం చేయడానికి ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం తెలిసింది.ఇలా పిఠాపురంలో ఒక గుంపు జనం వంగా గీత కార్యాలయానికి వెళ్లి అక్కడ గొడవ చేశారు. వేరేకాలనీల్లో డబ్బులు ఇచ్చారని తమకు ఇవ్వలేదని  డిమాండు చేశారు. అసలు ఈ ఓటుకి నోటు ఉద్దేశ్యం ఏంటంటే పోలింగ్ రోజున అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించి తీరాల్సిందే. ఉద్యోగాల్లో ఉండేవారికి పోలింగుకు వెళ్లడం వలన పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే వారి జీతం ఎక్కడకూ పోదు. కానీ అసంఘటిత రంగంలో కూలి చేసుకుని బతికేవారి పరిస్థితే చాలా కష్టం. ఓటింగునే నమ్ముకుంటే ఆరోజు వారికి బ్రతుకు తెరువు కోసం వచ్చే కూలి గల్లంతు అవుతుంది.


ఒక్కరోజు కూలి లేకపోయినా కష్టాలు తప్పని బతుకులు ఎన్నో ఉంటాయి. అలాంటి వారికి కాస్త భరోసాగా నిలవడం కోసం ఓట్లకు డబ్బులు పంచడం అనేది పాతకాలంలో ప్రారంభం అయిన వ్యవహారం. అయితే ఇప్పుడు అది ఒక హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు ఆ దశ కూడా దాటి.. ఓటర్లకు తెలుగుదేశం వారే ముందుగా డబ్బులు పంచేసి.. నమ్మకస్తులైన కొందరి రౌడీలతో అదనంగా వైసీపీ వారిని అపకీర్తి పాల్జేయడానికి ఎగదోస్తున్నట్టుగా సమాచారం. ఇలా టీడీపీ రౌడీయిజానికి పాల్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: