విజయ్కి మంచి మనసు వల్లే లక్షల ఫ్యాన్స్ ఉన్నారు?

Purushottham Vinay
ఇతరులకు, పరిచయం లేని వాళ్లకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు, పేదరికం వల్ల చదువుకు దూరమైన వాళ్లకు సహాయం చేయాలంటే ఇంకా మంచి మనస్సు ఉండాలే తప్ప ఎలాంటి రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనూ సూద్, KA పాల్ లాంటి ప్రముఖులు రాజకీయాల్లోకి రాకుండానే జనాలకు చాలా మేలు చేశారు. ఇంకా మేలు చేస్తున్నారు.అలాంటి మంచి మనస్సుతో సహాయం చేస్తూ లారెన్స్ కూడా చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్  కూడా తన మంచి మనస్సును చాటుకుంటున్నారు. మరో 40 రోజుల తర్వాత  విజయ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.ఆరోజు పది, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ బహుమతులు ఇవ్వడంతో పాటు కొంత మొత్తం నగదు అందిస్తారని సమాచారం తెలుస్తోంది. గత పుట్టిన రోజుకు విజయ్ ఈ విధంగా చేయడంతో ఈ పుట్టినరోజుకు కూడా అదే విధంగా  చేయబోతున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో హీరో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బాగా కానున్న సంగతి తెలిసిందే.విద్యార్థులకు సహాయం చేసే విషయంలో మాత్రం స్టార్ హీరో విజయ్ ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్ల నుంచి చాలా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


సినిమాలకి విజయ్ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం. విజయ్ ఇక రెండు సినిమాలలో నటించి ఆ సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పనున్నారు. విజయ్ తమిళనాడు సీఎం కావడమే లక్ష్యంగా పొలిటికల్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.అయితే తమిళనాడులో ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు విజయ్ కు కలిసొస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పైగా ఇలాంటి మంచి మనుసున్న విజయ్ కి లక్షలాది ఫ్యాన్స్ ఉండటం సహజం అని అయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.విజయ్ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.తరచుగా విజయ్ విషయంలో ఏ హీరోకి రాని విధంగా  ట్రోల్స్ వస్తాయి. కానీ విజయ్ ఇప్పుడు చేస్తున్న మంచి పనుల వల్ల ఆ ట్రోల్స్ చాలా వరకు తగ్గాయి. విజయ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అంతేగాక విజయ్ భవిష్యత్తులో కూడా సినిమాలలో కొనసాగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: