ఓరినాయనో.. రక్తపింజరను నూడిల్స్ తిన్నట్లుగా తినేసిన గుడ్లగూబ?

praveen
అడవిలో ఉండే ప్రతి జంతువు ప్రతిక్షణం జీవన పోరాటం కొనసాగిస్తూ ఉండాల్సిందే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అడవిలో ఒక జీవికి ఆకలేస్తుంది అంటే మరో జీవికి ఆయువు మూడినట్టే. ఎందుకంటే ఒక జీవిని చంపితే గాని మరో జీవి ఆకలి తీరదు. ఆకలి తీరితే గాని ఆ జీవి బ్రతికి బట్ట కట్టదు. అందుకే ఇక తను బతకాలంటే మరో జీవిని చంపి ఆహారంగా మార్చుకోవాల్సిందే. ఇలా ఎప్పుడూ అడవిలో ఒక జంతువు జీవితం మరో జంతువు మీద ఆధారపడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అడుగులో ఓ జంతువు మరో జంతువును వేటాడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి.

 ఇక ఇలా సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని కొన్ని వీడియోలు అయితే అటు భయానకంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా విషపూరితమైన పాములలో అత్యంత డేంజరస్ పాము ఏది అంటే రక్తపింజర అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే నాగుపాము కాటు వేసిన బతకడానికి ఛాన్స్ ఉంటుందేమో కానీ అటు రక్తపింజార ఒక్కసారి కాటు వేసిందంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఇలాంటి విషపూరితమైన పాము జోలికి వెళ్లడానికి అన్ని జంతువులు పక్షులు కూడా భయపడిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 కానీ ఇక్కడ ఒక గుడ్లగూబ మాత్రం ఏకంగా ప్రమాదకరమైన రక్తపింజరనే నూడిల్స్ తిన్నట్లుగా తినేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సాధారణంగా అయితే పాములు పక్షుల్ని ఎలుకలని కప్పలని పక్షి గుడ్లను తినడం ఇప్పటివరకు చూసాం  కానీ ఇలా ఒక గుడ్లగూబ పామును మింగడం మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. అది కూడా ప్రమాదకరమైన రక్తపింజర పామును నూడుల్స్ తిన్నట్లుగా అమాంతం నోట్లోకి లాగేసుకుంటుంది గుడ్లగూబ. ఇక ఇది చూసి ఈ వీడియో ఎంతో భయానకంగా ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: