ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీని రీమేక్ చేయాలని ఉంది... విశ్వక్ సేన్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది మూవీ తో నటుడి గా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థానంలో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ ని మే 31క్వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అయిన ఓ సినిమాని రీమేక్ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం నా అల్లుడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం.

ఆ మూవీ కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి రీమిక్ చేయాలని ఉంది అని విశ్వక్ సేన్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శ్రేయ , జెనీలియా హీరోయిన్ లుగా నటించగా ... రమ్యకృష్ణ ఈ మూవీ లో ఎన్టీఆర్ కి అత్త పాత్రలో నటించింది. వర మల్లపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2005 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: