వైసీపీ Vs కూటమి: సామాజిక వర్గ సంక్షేమం ఎవరితో సాధ్యం..?

Divya
గత 2019 ఎన్నికలలో అటు వైసీపీ ఇటు టిడిపి రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి.. ఎవరికి వారు ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోలు ప్రకటించారు.. అయితే 2014 ఎన్నికలలో మేనిఫెస్టో ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని పూర్తి చేయడంలో విఫలమయ్యారు.. దీంతో ప్రజలలో విశ్వాసం కోల్పోవడంతో 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో భాగంగా నవరత్నాలు అంటూ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి.. ఆ పథకాలు ప్రజలను ఆకర్షించడమే కాదు ఇప్పుడు వాటి ద్వారా లబ్ధి కూడా పొందారు.. ఈ క్రమంలోననే 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ వైసీపీ నే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్న విషయం తెలిసిందే..
మరోవైపు ఇదే ఎన్నికలలో టిడిపి కూడా సరికొత్త మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వచ్చింది.. అయితే ఇక్కడ కూడా ప్రజల్లో అసమ్మతి నెలకొనిందని చెప్పాలి.  ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత ప్రకటించిన హామీలను నెరవేర్చకపోవడం ఒక మైనస్ అయితే ఇప్పుడు నెరవేర్చలేని హామీలను కూడా ప్రకటించడం మరొక మైనస్ అని చెప్పాలి. అందుకే ప్రజలలో  ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కూటమితో పొత్తు పెట్టుకుంది టిడిపి.. పొత్తులో భాగంగా జనసేన, బిజెపి, టిడిపి మూడు పార్టీలు పెద్ద ఎత్తున అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా.. వైసీపీ మాత్రం సింగిల్ హ్యాండ్ తో మళ్ళీ తామే సీఎం అంటూ భీమా వ్యక్తం చేస్తున్నారు..

అయితే సీఎం ఇంత ధీమా వ్యక్తం చేయడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే..  ముఖ్యంగా చాలామంది సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఇప్పటికే ఎంతోమంది పార్టీ అధినేతలు సొల్లు మాటలు చెబుతున్నారే కానీ నెరవేర్చిన దాఖలాలు లేవు.. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక వర్గాలకు వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పాలి . అందులో భాగంగానే ప్రతి సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చేశారు జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యంగా వైసీపీ సామాజిక వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాల విషయానికి వస్తే..చేనేత  కళాకారుల కోసం నేతన్న నేస్తం.. ఈ పథకం కింద 5 దఫాలలో .. అర్హులైన ప్రతి వ్యక్తికి  ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.1,20,000 లను నేరుగా వారి ఖాతాలోకి వేశారు. వైయస్సార్ కాపు సంక్షేమం పథకం కింద 5 దఫాలలో అర్హులైన ఒక్కొక్కరికి రూ.60 వేల రూపాయలను వారు ఖాతాలో వేశారు .అలాగే వైయస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ మహిళలందరికీ వైయస్సార్ పార్టీ ఐదేళ్లలో రూ.75,000 ,లను జమ చేశారు. అలాగే ఈబీసీ నేస్తం కింద  45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న అక్కచెల్లెమ్మలకు  రూ.45,000 లను చెల్లించారు. ఇలా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సామాజిక వర్గాల వారు కూడా మళ్లీ తమ సామాజిక వర్గాలు సంక్షేమ పథం వైపు అడుగులు వేయాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: