వైసీపీ ఓడిపోతే జగన్ చెప్పేది ఇదేనా.. అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెబుతారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు. సాధారణంగా ప్రధాన పార్టీల నేతలంతా ఏకమైతే ఓటమి తప్పదని మరో పార్టీ నేత భావించడం జరుగుతుంది. అయితే జగన్ మాత్రం తమ పార్టీదే అధికారమని తమ పార్టీ మాత్రమే చెప్పిన హామీలను చెప్పినట్టుగా అమలు చేస్తుందని జగన్ చెబుతున్నారు. అయితే కూటమికి ధీటుగా వైసీపీ మేనిఫెస్టోను మాత్రం ప్రకటించలేదు.
 
2014 సంవత్సరంలో వైసీపీ ఓటమికి రుణమాఫీ కారణమని చెప్పే జగన్ ఈ ఎన్నికల్లో ఏ కారణాల చేతైనా ఓటమిపాలైనా అలివి కాని హామీలను తాను ప్రకటించలేదని అందుకే ఓటమిపాలయ్యానని చెబుతారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. తాను మంచి చేశానని నమ్మితే ఓటేయండని చెబుతున్న జగన్ తన పాలనను ప్రజలు నమ్మితే మాత్రమే ఒటేస్తారని ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.
 
అయితే జగన్ కళ్లలో మాత్రం గెలుస్తామనే ధీమా కనిపిస్తోందని అందువల్లే టీడీపీ లేదా ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న పథకాలను అనుసరించాలని భావించలేదని తెలుస్తోంది. అధికారం దక్కుతుందో లేదో ప్రజలకే వదిలేస్తున్నానని ప్రజలే తుది తీర్పు విషయంలో నిర్ణయం తీసుకుంటారని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ మన పార్టీదే అధికారం అని జగన్ వైసీపీ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారని భోగట్టా.
 
జగన్ కాన్ఫిడెన్స్ ను చూసి చాలామంది వైసీపీ అభ్యర్థులు విజయం తథ్యమనే నమ్మకంతో పని చేస్తున్నారని తెలుస్తోంది. మెజారిటీ సర్వేలు సైతం వైసీపీదే ఈసారి అధికారమని చెబుతున్నాయి. మూడు పార్టీల పొత్తు మూడు పార్టీలను ముంచేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్, కూటమి నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాలి. ఓటుకు నోటు విషయంలో కూటమి నేతలు, వైసీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీలు భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నాయని తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: