అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు..!

Divya
అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు..ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్  మనీ ల్యాండరింగ్  కేసులో అరెస్టయ్యారు. తాజాగా ఇప్పుడు భారీ ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ నీ  కూడా ఈరోజు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 1వ తేదీ వరకు ఈ బెయిల్ ను సైతం మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం పైన అటు అభిమానుల నేతలలో చాలా ఆందోళన ఉండేది కానీ ఎట్టకేలకు ఇప్పుడు మద్యంతర భైలు ఇవ్వడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు నేతలు.

ఏప్రిల్ ఏడవ తేదీన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని పూర్తి చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని నిన్నటి రోజున తెలియజేశారు.. అయితే ఈ రోజున కేజ్రీవాల్  మధ్యంతర బెయిలను ఇచ్చారు. మార్చి 21వ తేదీన ఈడి అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఈ బెయిల్  వచ్చినప్పటికీ కూడా సీఎంగా అధికారిక విధులకు సైతం దూరంగా ఉండాలంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలియజేసిందట. అందుకు తాను  పూర్తిగా సహకరిస్తారని కూడా కోర్టుకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం కేజ్రీవాల్.

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు కేజ్రీవాల్ కు అనుకూలంగా వచ్చిందని సమాచారం. అయితే అరెస్టుకు ముందు ఎన్నోసార్లు ఈడి జారీ చేసిన సామాన్లకు స్పందించని కేజ్రీవాల్  విచారణకు కూడా హాజరు కాలేదట.. అలా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కూడా హైకోర్టుని ఆశ్రయించారు.అయితే అక్కడ ఊరట  దక్కకపోవడంతో చివరికి ఈడి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెయిల్  ఇవ్వాలని ఎక్కడ హక్కు లేదని కూడా అలా బెయిల్  ఇచ్చిన దాఖలు కూడా లేవని ఈడి కోరింది. కానీ చివరికి మాత్రం ఎట్టకేలకు అరవింద్ వాళ్లకి బెయిల్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: