జగన్: ఆ ఒక్క నిర్ణయమే.. లక్కీగా మారిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల పోరు చాలా ఉత్కంఠాన్ని కలిగిస్తోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ కూడా కొనసాగుతోంది. ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు సీఎం జగన్ కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. పోలింగ్ ముందు వరకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు సీఎం జగన్.. ముఖ్యంగా తాను తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఎన్నికల ఫలితాలను సైతం డిసైడ్ చేసేలా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా ప్రత్యర్థి పార్టీలు కూడా జాగ్రత్తపడేలా చేశారు.

ఈనెల 13వ తేదీన పోలింగ్ జరగబోతున్న సందర్భంగా ఓటర్లను సైతం ఆకట్టుకునే విధంగా ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేయబోతున్నారు. ఆ తర్వాత రోజా పోటీ చేస్తున్న నగరి ప్రాంతంలో ప్రచారం చేసి సాయంత్రం కడప ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మంగళగిరిలోని జగన్ ప్రచారంలో భాగంగా చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అలాగే నగరి ప్రాంతంలో సొంత పార్టీలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారట జగన్.

 కడప ఎన్నికలలో ప్రచారంలో భాగంగా జగన్ ముస్లిం రిజర్వేషన్ల పైన మరింత స్పష్టత ఇచ్చేలా కనిపిస్తోంది. తాజాగా డిబిటి పథకాల నగదు బదిలీల కూడా కోర్టు ఈరోజు ఒకటి అనుమతి ఇచ్చింది.. లబ్ధిదారుల ఖాతాలో ఈరోజు నగదు జమ చేసేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సమయంలో కోర్టు మరికొన్ని కండిషన్లను పెట్టింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో భాగంగా చివరి సభను ఎంపిక చేసుకున్నారు జగన్. అక్కడ కూడా జగన్ కీలకంగా ప్రసారం చేయబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. చివరి రెండు రోజులు పరిణామాలు ఎన్నికలలో గెలుపుకు మరో కీలకంగా కానుంది.. మరి ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ పథకాల ద్వారా ఓట్లు పడితే.. కచ్చితంగా ఇది లక్కీ అవకాశమే అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: