విశాఖ‌లో కూట‌మి వార్ వ‌న్‌సైడ్ నుంచి టైట్ ఫైట్ వ‌ర‌కు..?

RAMAKRISHNA S.S.
- న‌గ‌రంలో మూడు సీట్ల‌లో వైసీపీ నుంచి గ‌ట్టి పోటీ
- బాల‌య్య అల్లుడు భ‌ర‌త్‌లో మొద‌లైన టెన్ష‌న్‌
- విశాఖ నార్త్‌, వెస్ట్‌, సౌత్‌లో వైసీపీకి కూడా విన్నింగ్ ఛాన్స్‌..?
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
మామూలుగా గత 6 నెలల నుంచి చూస్తే విశాఖ పార్లమెంటు పరిధిలో ఈసారి పక్కాగా టిడిపి నుంచి పోటీ చేస్తున్న గీతం విద్యాసంస్థల చైర్మన్ శ్రీ భరత్ విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. ఎప్పుడు అయితే వైసిపి నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పేరు ఖరారు అయిందో ఒక్కసారిగా ఈక్వేషన్లు మారిపోయాయి. లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో భరత్ గెలుస్తారు అనుకున్న పరిస్థితి నుంచి భరత్ గెలిస్తే గొప్ప రా బాబు అనే కాడకు పరిస్థితి దిగజారింది. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భీమిలి.. గాజువాకలో మాత్రం తెలుగుదేశం భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖరారు అయినట్టే.

భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, గాజువాక‌లో ప‌ల్లా శ్రీనివాస‌రావు మంచి మెజార్టీల‌తో గెలుస్తారు. ఇక విశాఖ తూర్పులో వరుసగా మూడుసార్లు గెలిస్తే వస్తున్న టిడిపి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఈసారి గెలుపు అంత ఈజీ కాదు. అక్కడ నుంచి వైసీపీ తరఫున ప్రస్తుత విశాఖ ఎంపీ వెలగపూడి సామాజిక వర్గానికి చెందిన ఎంవీవి సత్యనారాయణ పోటీలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ఏడాది నుంచే ప్రజల్లో ఉంటున్నారు. ఈసారి వెలగపూడి గెలిచినా తూర్పులో గట్టి పోటీ అయితే తప్పదు.

నార్త్‌లో ఇద్ద‌రు రాజులే పోటీ చేస్తున్నారు. వైసీపీ కెకె రాజు గ‌త ఐదేళ్ల నుంచి ఓడిపోయినా ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. బీజేపీ విష్ణుకుమార్ రాజు కెకె రాజు ముందే త‌ట్టుకోలేని ప‌రిస్థితి ఉంది. ఈ సీటు బీజేపీకి డౌటే అన్న టాక్ ఉంది. ఇక ద‌క్షిణంలో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్ ఈ సారి టీడీపీ నుంచి కాకుండా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న మాస్ లీడ‌ర్‌.. ఇక్క‌డ జ‌న‌సేన నుంచి పోటీ చేస్తోన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచాకే గెలిచాడు అనుకోవాల‌ని అంటున్నారు. ఇక ప‌శ్చిమంలో గ‌ణ‌బాబు హ‌వా ఈ సారి త‌గ్గింద‌ని.. వైసీపీ అడారి ఆనంద్ నుంచి గ‌ట్టి పోటీ త‌ప్ప‌ట్లేదంటున్నారు. ఇక ఎస్ కోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీ వ‌ల్లే ఇక్క‌డ వైసీపీ ఎంపీ గెలిచింది. ఈ సారి అక్క‌డ టీడీపీలో గ్రూపులు ఎక్కువుగా ఉన్నాయి. ఓవ‌రాల్‌గా విశాఖ పార్ల‌మెంటులో 3-4 సీట్ల‌లో వైసీపీకి ఛాన్సులు ఉన్నాయి. దీంతో పార్ల‌మెంటు కూడా టీడీపీ గెలుపుపై డౌట్‌లో ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: