నెల్లూరు : ఆ వైసీపీ అభ్యర్థి ముందే చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల జోరు కొనసాగుతుంది. అధికార, ప్రతి పక్ష పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇరు పార్టీ నేతలు విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటూ ఊహించని హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఇరు పార్టీ వర్గాలు వ్యూహ రచన చేస్తున్నాయి.. ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టో తయారీలో ఇరు పార్టీలు తీవ్రంగా చర్చిస్తున్నాయి. త్వరలోనే వారు తమ మేనిఫెస్టోలను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో నెల్లూరు జిల్లాలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి అయిన సంజీవయ్య ముందే నామినేషన్ వాహనంపై వైసీపీ నేతలు చెప్పులతో కొట్టుకోబోయారు.పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు ఎక్కువవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసిపి పార్టీ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంజీవయ్య మళ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో ఎమ్మెల్యే వాహనం పైన ఉన్న ద్వితీయ స్థాయి నాయకులు గొడవ పడడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఇద్దరు నేతలు తమ చెప్పులతో కొట్టుకునే పరిస్థితి చోటు చేసుకుంది.ఎండీసీసీబీ ఛైర్మెన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మరియు సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ల మధ్య ఈ వివాదం జరిగింది.సంజీవయ్య వారి ఇద్దరి మధ్య ఘర్షణ ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించి ఈ క్రమంలో పక్కకు తూలి పడబోయారు.సూళ్లూరుపేట సీఐ జోక్యంతో గొడవ సద్దుమనిగింది.ఈ సమయంలో ఎమ్మెల్యే సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి గడ్డం పట్టుకుని బుజ్జగించడం అలాగే శేఖర్ రెడ్డి ని వెళ్ళిపోవద్దు ప్రచార రథం పైకి రావాలని బ్రతిమిలాడడం చోటు చేసుకుంది.ఇలానే ఉంటే రాబోయే రోజులలో వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమని అక్కడి నాయకులు భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: