చంద్రబాబు: మాస్టర్ మైండ్ ప్లాన్.. వర్క్ అవుట్ అయ్యిందా..?

Divya
గడిచిన ఐదు సంవత్సరాలుగా చంద్రబాబును ఏ పార్టీ అయితే ద్వేషించి దగ్గరకి రానీయకుండా చేసిందో ఇప్పుడు అదే పార్టీతో మళ్ళీ టిడిపి పొత్తు పెట్టుకుంది.ముఖ్యంగా టిడిపి పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళింది. అలాగే చంద్రబాబు చెప్పిన అన్ని సీట్లు కూడా తీసుకోవడం గమనార్హం. అయితే ఇలా తీసుకున్నటువంటి సీట్లలో కూడ ఎక్కువగా చంద్రబాబు పంపిన అభ్యర్థులనే ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు దక్కించుకోగా బీజేపీ 10అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలను తీసుకున్నారు.

అంటే మొత్తం మీద ఇక్కడ 31 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలు అయితే చంద్రబాబు బిజెపి ,జనసేన పార్టీకి ఇచ్చారు. కానీ ఇందులో పోటీ చేసే నేతలు మాత్రం చాలా మంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే అన్నట్టుగా తెలుస్తోంది. మరొకవైపు టిడిపి నుంచి జనసేనకు బిజెపిలోకి వెళ్లిన వారికే మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి నాయకులకే సీట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ ప్లానే అన్నట్లుగా ఈ విషయంలో సక్సెస్ అయ్యారని కూడా కనిపిస్తోంది.

ముఖ్యంగా బిజెపి జనసేన పార్టీ సీట్లు చూసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ వీరు నిలబడిన స్థానాలలో గెలిచింది చాలా తక్కువ ఓడిపోయిన సీట్లను  ఇవ్వడంలో చంద్రబాబు కాస్త చక్యంగానే ప్రదర్శించారు. గెలిచే సీట్లను ఆ రెండు పార్టీలలో ఉన్న తన అనుకూలమైన నేతలకు మాత్రమే ఇప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మూడు పార్టీలలో మొత్తంగా చూసుకుంటే ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీ నేతలే ఉన్నారని విధంగా కనిపిస్తోంది. ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ , బిజెపి పార్టీ కూడా తమకు పట్టున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు ప్లాన్ ప్రకారమే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగారని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు ఎంత మందిని గెలిపించుకుంటారు అనే విషయం ఇప్పుడు ఇక్కడ సందేహంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: