ఏపీలో రుణమాఫీ చేయాలంటే 50 వేల కోట్లు కావాలట.. జగన్ రిస్క్ చేస్తారా?

Reddy P Rajasekhar
ఏపీలో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ హామీ ఇవ్వాలని వైసీపీ నుంచి ఈ ఒక్క హామీ లభిస్తే పార్టీకి తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణమాఫీని అమలు చేసిన వైసీపీ ఈ ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. తాజాగా ఒక వైసీపీ యాక్టివిస్ట్ రుణమాఫీ చెప్పన్నా 175 సీట్లు మనవే అంటూ కామెంట్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.
 
ఒక్క హామీ ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించింది. అయితే రుణమాఫీ విషయంలో జగన్ నిర్ణయం ఏ విధంగా ఉందో తెలియదు. కనీసం లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించినా ఓవర్ నైట్ లో లెక్కలు మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.
 
అయితే ఏపీలో రుణమాఫీ చేయాలంటే 50 వేల కోట్లు కావాలని సమాచారం అందుతోంది. 50,000 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదనే సంగతి తెలిసిందే. విడతల వారీగా రుణమాఫీ స్కీమ్ ను అమలు చేసినా ఏడాదికి 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కూటమి రుణమాఫీని ప్రకటించినా నమ్మే జనం లేరు. గతంలో ఈ హామీ విషయంలో తాము మోసపోయామని రైతులు భావిస్తున్నారు.
 
జగన్ ఎలాంటి హామీ ఇచ్చినా అమలు చేస్తారని ఖచ్చితమైన నమ్మకం ఉండటంతో వైసీపీకి ఆ నమ్మకమే ప్లస్ కానుంది. వైసీపీ మేనిఫెస్టో ప్రకటించడానికి మరో 4 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. జగన్ మేనిఫెస్టో కూటమిని ముంచేసేలా ఉండబోతుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో రుణమాఫీ ప్రకటించకపోవడం వల్ల ఓడిపోయిన జగన్ ఈ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి. రుణమాఫీ ప్రకటన కోసం ఏపీ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: