తెలంగాణ పై బీజేపీ స్పెషల్ ఫోకస్... వాళ్ల టార్గెట్ అదేనా..?

Pulgam Srinivas
మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దానిలో కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ వైపే తెలంగాణ ప్రజలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వచ్చారు కానీ చివరికి వచ్చేసరికి అప్పటివరకు పార్టీని ఫుల్ జోష్ లో నడిపించిన బండి సంజయ్ ని కాస్త సైడ్ చేయడం... అలాగే టికెట్ల పంపిణీ విషయంలో కూడా పెద్ద గ్రౌండ్ వర్క్ చేయకపోవడంతో బీజేపీ డల్ అయిపోయింది.

దానితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనే వాదన కూడా తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును పార్లమెంట్ ఎన్నికల్లో అస్సలు చేయకూడదు అని బీజేపీ అధిష్టానం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దానితో తెలంగాణలో ఈ సారి దాదాపు పది ఎంపీ సీట్లు లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ లో ఫుల్ క్రేస్ ఉన్న కేంద్ర నాయకులు అంతా కూడా తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ వేశారు. దానిలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. అలాగే చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా రీసెంట్ గ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ , ఎంపీ లక్ష్మణ్‌ హాజరైయ్యారు. ఇవాళ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ కేంద్రమంత్రి జై శంకర్‌ హాజరవుతారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరో రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటిస్తారు. అందులో భాగంగా అమిత్ షా మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధిపేటలో బహిరంగ సభకు హాజరుకానున్నారు. మే ఫస్ట్‌ వీక్‌ లో ప్రధాని మోదీ , బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు.

ప్రధాని మోదీ తో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో వీలైనన్ని బారి సభలు అలాగే బారి రోడ్‌ షో లను నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా బీజేపీ కేంద్ర నాయకులు వరుస పెట్టి తెలంగాణలోకి రానున్నారు. దీనితో తెలంగాణ పై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: