తెలంగాణ : రేవంత్ మ్యాజిక్.టార్గెట్ పెడితే ప్రత్యర్థులకు చుక్కలే.!

Pandrala Sravanthi

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారని చెప్పవచ్చు. సోనియా,రాహుల్ గాంధీ అండతో  గత కొన్ని సంవత్సరాలుగా దూకుడు ప్రదర్శించి  తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి మాస్ క్లాస్  అన్ని టైప్స్ లో మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి. మాటలతో మెస్మరైజ్ చేయగలుగుతాడు. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా పార్లమెంట్ సీట్లలో మెజారిటీ సీట్లు సాధించాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలకు అద్భుతమైన హామీలు ఇస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నిజామాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. 

 ముఖ్యంగా నిజామాబాద్ లో జీవన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలను ఆకట్టుకునే ప్రసంగం చేశారు. మీరు జీవన్ రెడ్డిని గెలిపించండి  సోనియా, రాహుల్ ను ఒప్పించి ఆయనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. 2014, 19 నిజామాబాద్ పసుపు రైతుల మద్దతుతో  కవిత, అరవింద్ గెలిచారు. కానీ బోర్డు విషయంలో ఇప్పటివరకు వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే మాత్రం తప్పక ఆయనకు కేంద్ర మంత్రి పదవి తీసుకువస్తాను. ఆ పదవి వస్తే పసుపు బోర్డు అనేది చాలా ఈజీగా వస్తుందని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. అంతేకాకుండా మూతపడిన చక్కర కర్మాగారం కూడా సెప్టెంబర్ 17లోగా తెరిపించే బాధ్యత నాది అంటూ రేవంత్  అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

 ఈ విధంగా ఆయన మాటలతో ప్రజలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అలాగే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఆయన ప్రసంగిస్తూ దూసుకుపోతున్న ఈటెలను ఆపేసాడని చెప్పవచ్చు. కమ్యూనిస్టు అని చెప్పుకుని తిరిగే ఈటెల రాజేందర్  మతతత్వ పార్టీతో చేతులెలా కలిపారని ప్రశ్నించారు. హుజురాబాద్ ను అభివృద్ధి చేయలేదు కాబట్టి అక్కడి ప్రజలు తరిమికొట్టారని, తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనోడు మల్కాజ్ గిరికి వచ్చి ఏం చేస్తాడు అని  ఈటెల రాజేందర్ ను ఇరుకున పెట్టే  ప్రసంగం చేశారు. ఈ విధంగా ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం రకరకాల వ్యూహాలతో అద్భుతమైన హామీలు  ఇస్తూ దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: