ఉమ‌న్ Vs ఉమ‌న్‌: 1999 త‌ర్వాత అక్క‌డ ఉమ‌న్ వ‌ర్సెస్ ఉమ‌న్‌..!

RAMAKRISHNA S.S.
మ‌హిళ‌ల చైత‌న్యం పెరిగిన త‌ర్వాత‌... వారిలో రాజ‌కీయ ఆకాంక్ష‌లు కూడా పెరుగుతూ వ‌చ్చాయి. అందు కే.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. మ‌హిళ‌ల రాజ‌కీయ రంగ ప్ర‌వేశం పుంజుకుంటూ వ చ్చింది. ఇక‌, ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లే అభ్య‌ర్థులు-ప్ర‌త్య‌ర్థులుగా పోటీలో ఉన్నా రు. ఇలాంటి వాటిలో కీల‌క‌మైన జ‌న‌ర‌ల్ స్థానం.. గుంటూరు వెస్ట్‌. ఇక్క‌డ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక ల్లో.. ప్ర‌ధాన పార్టీల నుంచి బ‌రిలో ఉన్న ఇద్ద‌రు నాయ‌కులు మ‌హిళ‌లే.

టీడీపీ నుంచి గ‌ల్లా మాధ‌వి, వైసీపీ నుంచి విడుద‌ల ర‌జ‌నీ బ‌రిలో ఉన్నారు. అయితే.. ఇద్ద‌రూ కూడా స‌మ ఉజ్జీలు అన‌డంలో సందేహం లేదు. ఆర్థికంగా. ఇరువురూ బ‌ల వంతులు. సామాజిక వ‌ర్గాల ప‌రంగా కూడా ఇద్ద‌రూ బీసీ సామాజిక వ‌ర్గం మ‌హిళా నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. రాజ‌కీయ అనుభ వం ప‌రంగా.. విడ‌ద‌ల ర‌జ‌నీ ముందు వ‌రుసలో ఉన్నారు. సేవ‌ల ప‌రంగా మాధ‌వి ముందున్నారు. మొత్తంగా ఇద్ద‌రూ కూడా బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే..గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌లు పోటీ చేయ‌డం కొత్త‌కాదు. గ‌తంలో ఒకే ఒక్క‌సారి అంటే.. 1999లో ఇక్క‌డ నుంచి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులుగా ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆనాటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొస‌నం భార‌తి పోటీ చేయ‌గా.. టీడీపీ నుంచి పోటీ చేసిన శ‌నక్కా యల అరుణ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరా హోరీ పోరు కూడా సాగింది. అరుణ స్వ‌ల్ప మెజారిటీ 6 వేల ఓట్ల‌తో గెలుపు గుర్రం ఎక్కారు.

క‌ట్ చేస్తే.. సుమారు 20 ఏళ్ల త‌ర్వాత‌.. తొలిసారి ఇద్ద‌రూ మ‌హిళా అభ్యర్థులే రంగంలో ఉండ‌డం గ‌మ‌నా ర్హం. గ‌ల్లా మాధ‌విని గ‌మ‌నిస్తే.. సేవ‌ల ప‌రంగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ముందున్నారు. ఇక‌, వైసీపీ అభ్య‌ర్థి ర‌జ‌నీ ఇప్ప‌టికే మంత్రిగా ఉన్నారు. కాక‌పోతే.. ఒక‌రు లోక‌ల్ అయితే.. మ‌రొక‌రు నాన్ లోక‌ల్ . ఇదే.. ఇప్పుడు రాజ‌కీయంగా ప్ర‌భావం చూపిస్తోంది. ఎవ‌రు గెలిచినా.. స్వ‌ల్ప మెజారిటీతోనే అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: