కరీంనగర్: బండి మతం పాలిటిక్స్ వర్కౌట్ అయ్యేనా..ప్రజలు ఏమంటున్నారంటే.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంటు ఎలక్షన్స్ జోరు నడుస్తోంది.  రాష్ట్రంలోని మొత్తం పార్లమెంటు సెగ్మెంట్లలో కరీంనగర్ సెగ్మెంట్ లో రసవత్తరమైన పోటీ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో బిజెపి, బీఆర్ఎస్ మాత్రమే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇదే తరుణంలో బిజెపి పార్టీ నుంచి  సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి టికెట్  దక్కించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్  టికెట్ దక్కించుకున్నారు. అయితే ఈయన కరీంనగర్ కు 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పనిచేశారు. 2019లో  మళ్లీ పోటీ చేసి బండి సంజయ్ పై ఓటమిపాలయ్యారు. వినోద్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం బరిలోకి వచ్చారు. ఇదే తరుణంలో బండి సంజయ్ మరియు వినోద్ కుమార్ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. మరి ఇద్దరు బిగ్ నేతల పోటీలో  ప్రజలు ఏ వైపు ఉన్నారనేది తెలుసుకుందాం..


 బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్:
 ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్ని ఏళ్లపాటు సేవలందించారు.  ఆయన కరీంనగర్ కు చేసింది ఏమీ లేదని ప్రజల్లో విపరీతమైనటువంటి మైనస్ ఉంది. కేవలం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు లేవనే అపోహ ప్రజల్లో విపరీతంగా ఏర్పడింది. ఆయన ఎంపీగా ఉండడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ ఎంతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చిన ఆయన వినియోగించుకోలేదని ప్రజలు అంటున్నారు.

కేవలం మతం పేరుతో యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వినోద్ కుమార్ విషయానికి వస్తే  ఈయన వృత్తిపరంగా న్యాయవాది, కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడిగా ఉండేవారు. అలాగే కరీంనగర్ ను స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారు. కరీంనగర్ కు కేబుల్ బిట్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, లాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఈయన హయాంలోనే వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు.  అంతేకాకుండా ఎంతో వాక్చాతుర్యం కలిగినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గత కొన్ని నెలల నుంచి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఆయన వైపే మొగ్గుచూపె   అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే  ఇప్పటివరకు కూడా అధిష్టానం టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కన్ఫామ్ చేయలేదు. దీంతో కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: