ఏపీ: అవినాష్ రెడ్డిపై కొత్త అస్త్రం ప్రయోగిస్తున్న షర్మిల.. కడపలో గెలిచేనా..?

Suma Kallamadi

కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేస్తున్న విషయం విధితమే. ఇదే జిల్లా నుంచి వైసీపీ నేత అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు. అయితే సేమ్ క్రిమినల్ కేసును తమకు అస్త్రంగా వాడుకుంటున్నారు షర్మిల. వివేకానంద రెడ్డి కూతురు సునీతతో కలిసి అవినాష్ రెడ్డి పై బహిరంగంగా వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపేశాడు అంటూ, హంతకుడికి ఓట్లు వేస్తారా మీరు అని అడుగుతూ తెగ రెచ్చిపోతున్నారు.
కోర్టు పరిధిలో ఉన్న ఒక అంశం గురించి మాట్లాడటం తప్పు. హత్య చేస్తూ అడ్డంగా బుక్కైనా.. కోర్టే తీర్పు ఇవ్వాలి. కోర్టే అతడిని దోషిగా నిర్ధారించాలి. అంతేకానీ వైఎస్ షర్మిల, సునీత ఇలా తమకి నచ్చినట్లు తీర్పు ఇచ్చేస్తూ తిరగడం వారికే మంచిది కాదు అని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా వీరిపై కన్నెర్ర చేసింది. తమ ఇష్టానికి ఎవరికి వారు తీర్పులు ఇచ్చేయవద్దని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తాను వివేకానందరెడ్డిని చంపలేదని కామెంట్లు చేశారు. అయితే వివేకానంద రెడ్డి షర్మిలను ఎంపీగా చూడాలనుకున్నారని, ఆయన చిరకాల కోరికను నెరవేర్చాలంటే అవినాష్ ఈ ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ సునీత షాకింగ్ కామెంట్ చేసింది. అంటే ఆయన ఎలక్షన్ల నుంచి తప్పుకుంటే హంతుకుడు అయిపోడు అన్నమాట.
షర్మిల అసలు ఒక హత్య కేసులో ఉన్న నిందితుడిని జగన్ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అవినాష్ రెడ్డిని ఐదేళ్లుగా జగన్ కాపాడుకుంటూ వస్తున్నారని అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అవినాష్ రెడ్డిని ఒక మర్డరర్‌గా చిత్రీకరిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని వీరు చూస్తున్నారు. మరి చివరికి కడప జిల్లా ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: