మెదక్ : గెలుపును డిసైడ్ చేసేది పఠాన్ చెరు ఓటర్లేనా?

praveen
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయ డంక మోగించబోతున్నారు అనే విషయం గురించి రాష్ట్రమంతుటా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని పార్టీలకు కూడా సెంటిమెంట్గా తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 2004 నుంచి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఇక అంతకుముందు ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచింది. దీంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అని పిలుచుకునే వారు. అయితే ఈ కంచుకోటని మరోసారి నిర్మించుకోవాలని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ భావిస్తుంది.

 అదే సమయంలో 2004 నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న బిఆర్ఎస్ ను ఇక్కడ ఓడించి కెసిఆర్ ను సొంత జిల్లాలోనే ఓడించాము అంటూ విమర్శలు గుప్పించి మానసికంగా దెబ్బ కొట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నాడట. దీంతో ఇక మెదక్ పార్లమెంట్ బరిలో అభ్యర్థుల గెలుపోవటలపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తుండగా.. బిఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు బరిలో నిలిచారు అని చెప్పాలి. ఇక ఈ ముగ్గురు కూడా ఎవరికివారు ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.

 అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. మరోవైపు కీలక నేత మైనంపల్లి హనుమంతరావు కూడా నీలం మధు వెంటే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది పటాన్చెరు ఓటర్లే అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ నాలుగు లక్షల పదివేల 170 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఇక్కడే అధికం. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. దీంతో మెదక్ అభ్యర్థుల గెలుపు ఓటమిని నిర్వహించేది పటాన్చెరు నియోజకవర్గం ఓటర్లే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: