23 సీట్లకు పరిమితం చేసింది ఈ బచ్చానే బాబు.. జగన్ స్పీచ్ జోష్ నింపుతోందిగా!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తనపై చేసే విమర్శలకు ఒకింత ఘాటుగానే బదులిస్తున్నారు. చంద్రబాబు తాజాగా ఒక సందర్భంలో జగన్ ను బచ్చా అని కామెంట్ చేయగా ఆ కామెంట్ కు జగన్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ అవుతోంది. అనకాపల్లి సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ "ఈ బచ్చానే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసింది బాబూ" అంటూ అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు. జగన్ స్పీచ్ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా అనుభవం అని చెప్పే నీ మార్క్ ఏదీ చంద్రబాబు అంటూ జగన్ సంధించిన ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఒంటరిగా ఎన్నికలకు రాలేని చంద్రబాబును ఏమనుకోవాలని ఆయనను ఏ పేరుతో పిలవాలంటూ జగన్ నిలదీయడం గమనార్హం. బాబు పుట్టినరోజున బాబును మాస్ ర్యాగింగ్ చేస్తూ జగన్ బంతాట ఆడుకున్నారని వైసీపీ కార్యకర్తలు, నేతలు కామెంట్లు చేస్తున్నారు.
 
చెప్పవయ్యా చంద్రబాబూ.. బచ్చా అంటే భయమెందుకంటూ రివర్స్ లో జగన్ ప్రశ్నించారు. నక్కలన్నీ ఏకమై కూడా సింగిల్ గా వస్తున్న మీ బిడ్డను చూసి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్ ను ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం తలపడుతున్నామని జగన్ వెల్లడించారు. శ్రీ కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, శ్రీరాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు వీళ్లలో గుర్తుకొస్తున్నాడని జగన్ తెలిపారు.
 
ఓడిపోయే కాలం వచ్చిన సమయంలో విలన్లకు హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని ఆయన కామెంట్లు చేశారు. మీ బిడ్డ చేసిన మంచికి మీ బ్యాంక్ ఖాతాలే సాక్ష్యమని జగన్ చెబుతున్నారు. మా మామే సీఎంగా ఉన్నారనే భరోసా పిల్లలకు ఇచ్చానని ఆయన కామెంట్లు చేశారు. జగన్ స్పీచ్ గతంతో పోల్చి చూస్తే మారిందని కామెంట్లు వినిపిస్తుండగా
వైసీపీ విజయం కోసం ఎంతో కష్టపడుతున్న జగన్ వైసీపీ అధికారంలో ఉంటే మాత్రమే పేదలకు పథకాలు అందుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: