జగన్: ఒక్క దెబ్బతో రెండు పార్టీలకు చెక్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే బస్సు యాత్ర పేరిట ప్రజలతో మమేకమవుతూ తాను చేపట్టిన సంక్షేమ పథకాలను మళ్ళీ వారికి గుర్తు చేస్తున్నారు.. మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మీరు లబ్ధి పొందితేనే మాకు ఓటు వేయండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రజల నుంచీ కూడా బస్సు యాత్రకు భారీ స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే తాజాగా బస్సు యాత్రలో భాగంగా రెండు పార్టీలకు చెక్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి.
మరోసారి ఏపీలో అధికారంలోకి రావడం మాత్రమే తన లక్ష్యం కాదని.. రాజకీయంగా అటు టిడిపి.. ఇటు జనసేన పార్టీలు కోలుకోలేని దెబ్బ కొట్టేలా ప్లాన్ చేశారు పలువురు కీలక నేతలతో సమావేశమై వ్యూహాలకు పదునుపెట్టారు.. అసలు ఇంతకు బస్సు యాత్రతో వైఎస్ జగన్ వేసిన అడుగులు ఏంటి అనే విషయానికి వస్తే... బస్సు యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పర్యటనకు అడుగడుగునా ప్రజలు నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ఒకవైపు.. ప్రజలలో వస్తున్న స్పందన రెండోవైపు.. పార్టీ నేతలలో జోష్ నింపుతూ ఎక్కడికి అక్కడే వ్యూహరచన చేస్తున్నారు.. ఇక ఇందులో భాగంగానే బస్సు యాత్రతో విపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు జగన్.. నిన్న మొన్నటి వరకు పరదాల వీరుడు అంటూ విపక్షాలు ఎగతాళి చేసినా..నేడు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లడం చూసి టిడిపి , జనసేన ఒక్కసారిగా చతికిల పడ్డారు.. ముఖ్యంగా వైసిపి అనుకున్న దానికంటే అధికంగా మైలేజ్ ప్రజల నుంచి రావడంతో వైసీపీలో కూడా జోష్ పెరిగింది. తాజాగా విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాయలసీమ,  కోస్తా జిల్లాలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతం అయింది. ఇతర పార్టీల నుంచి చేరికలు,  బహిరంగ సభలు,  రోడ్డు షోలతో ఫుల్ జోష్ తో ముందుకు వెళ్తున్నారు . ఇక ఇప్పుడు బస్సు యాత్రతో మరో దెబ్బ కొట్టారు ..విపక్షాలు మేల్కొనేలోపే రెండు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు.

మరొకవైపు జనసేన పార్టీ తో పాటు టిడిపికి తన బస్సు యాత్రతో చెక్ పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వేళ ఆ పార్టీ క్రియాశీలక నేతలకు గాలం వేస్తున్నారు. రాయలసీమ,  కోస్తా జిల్లాలకు చెందిన టిడిపి కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. త్వరలోనే మరికొన్ని చేరికలు ఉండేలాగా వైసిపి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పొత్తుల పంచాయతీతో పాటు టిడిపికి పట్టిన నియోజకవర్గం పరిధిలో అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే లోపు మరికొన్ని చేరికలు వైసీపీలోకి ఉండేలా అడుగులు వేస్తున్నారు..  అలా ఒకేసారి రెండు పార్టీలకు చెక్ పెట్టి కోలుకోలేని దెబ్బ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: