ఏపీ: జగన్ పై కొత్త అస్త్రం ప్రయోగిస్తున్న ఎల్లో మీడియా..??

Suma Kallamadi

ఏపీ సీఎం జగన్ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో బ్యాచ్ కథనాలను ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ సాగునీరు, తాగునీరు కోసం ఏం చేయలేదని ఆరోపిస్తున్నాయి. జగన్ పరిపాలనలో నీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని, ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని స్పెషల్ ఆర్టికల్స్ రాసి మరీ ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. ఈ కొత్త అస్త్రం ప్రయోగించి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయి.
జగన్ పై ఈ పత్రికలు ఇలా ప్రచారం చేస్తున్నాయి కానీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఏపీకి ఒక ప్రాజెక్టును కూడా నిర్మించలేకపోయారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పుకుంటారు కానీ అది కూడా చాలా స్లోగా కంప్లీట్ అయింది. నిజానికి ఇది ఒక ప్రాజెక్టుకు కూడా కానే కాదు. పోలవరం కాలువల లో నీళ్లు పోసే మామూలు ప్రాజెక్టు ఇది. నీళ్లు లేనిచోట నీళ్లు పోసే పని మాత్రమే ఇది చేస్తుంది. నీటిని నిల్వ చేయదు. నాగార్జునసాగర్, పోతిరెడ్డి వంటి ఉపయోగకరమైన ప్రాజెక్టు కాదు ఇది.
దీనికే టీడీపీ అది చేసింది, ఇది చేసింది అంటూ ఎల్లో మీడియా అతి చేసి ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు నేటి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు కానీ ఆయన ఏదో అద్భుతం చేశారు అది మీరు నమ్మాలి అన్నట్లు ఈ పత్రికలు రోజు కథనాలు రాయడం వింతగా అనిపిస్తుంది. జగన్ వెలిగోడు సొరంగం పూర్తి చేసి ప్రజలకు మంచి చేశారు. అలాగే మూడు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర నీళ్లను తన్నుకుపోతుందన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఎల్లో మీడియా మాత్రం జగన్ ప్రజలకు నీళ్లు అందించడం లేదని వార్తలు వడ్డించేస్తున్నాయి.
ఏది ఏమైనా ప్రజలు ఎల్లో మీడియా కథనాలను నమ్మకపోవచ్చు. కళ్ళముందు సంక్షేమ పథకాలు అందిస్తుందని జగన్ కే ఓటు వేయవచ్చు. మరోవైపు సాక్షి ఇలాంటి కథనాలను రాయడం లేదు. ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: