షర్మిల: అన్న పార్టీని దెబ్బతీయడానికే గురి..!!

Divya
కాంగ్రెస్ పార్టీ PCC బాధ్యతలను షర్మిల తీసుకున్నప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి కాస్త పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేసేందుకు ఆంధ్రాలో పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది షర్మిల.. ముఖ్యంగా రాయలసీమలో బలంగా చేసేలా ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగా విస్తృత పర్యటనలు కూడా చేస్తూనే ఉంది షర్మిల. ముఖ్యంగా కడప పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ఒక సంచలనాన్ని రేపింది. అలాగే వైఎస్ వివేక హత్య కేసును అక్కడ చర్చనీయాంశంగా మార్చింది. అయితే ఈ విషయం పైన కోర్టుకు వెళ్లడంతో ఎవరు ఈ విషయం పైన మాట్లాడకూడదంటూ ఆర్డర్ కూడా కోర్టు వేసింది.

దీంతో ప్రస్తుతం ప్రజలలో ఈ చర్చ మాత్రం జరిగేలా కనిపించడం లేదు. షర్మిల కర్నూలులో ప్రచారం చేస్తూ ఉన్నది.. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆదరణ ఆంధ్రాలో కనిపిస్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సునీత కూడా షర్మిల తో పాటు ప్రచారం చేస్తోంది.. ముఖ్యంగా నామినేషన్ దాఖలు అయిన తర్వాత షర్మిల ఎక్కువగా రాయలసీమలోని ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా షర్మిల కొన్ని నియోజకవర్గాల పైన గురిపెట్టి.. ప్రచారం చేయబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్ కు పడే ఓటు కచ్చితంగా వైసీపీ పార్టీదే అన్నట్లుగా అభిప్రాయం వినిపిస్తోంది.

దళితులు, ముస్లిం ఓటర్లు సైతం ఈసారి కాంగ్రెస్ వైపు గాని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిల రాయలసీమలో సీట్లు గెలవకపోయినా వైసిపి ఓటమిని శాసిస్తే ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు కూడా షర్మిలకి ఉంటుందనే వార్తలు కాంగ్రెస్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా షర్మిలనే ప్రజా వారసురాలుగా గుర్తించే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. దీంతో వైసిపి ఉనికి కూడా రాబోయే రోజుల్లో ప్రమాదం పడబోతోందని కాంగ్రెస్ నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: