బాబోయ్‌.. బెంబేలెత్తిస్తున్న కేఏ పాల్‌ ఆస్తుల లెక్కలు?

Chakravarthi Kalyan
నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. దీంతో ఏపీలో ఎన్నికల సందడి మరింత ఎక్కువైంది. ఈ సమయంలో తొలిరోజే పలువురు కీలక నేతలు నామినేషన్లు వేయగా..  రెండో రోజు మరింత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో కేఏ పాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన తన ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో ఏం వెల్లడించారు అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరుకి ఏమాత్రం పరిచయం అవసరం లేదు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో.. రానున్న ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్నారు. నామినేషన్ల సందర్భంగా కేఏ పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులతో పాటు కేసుల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని ప్రకటించిన ఆయన.. రూ.1.86లక్షలు మాత్రమే ఉన్నాయని వివరించారు.

ఇక విద్యార్హత విషయానికొస్తే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పాల్ వెల్లడించారు. తనపై మహబూబ్ నగర్, ఒంగోలు, ఎస్ కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతంలో ఆరు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా 2019 ఎన్నికల సమయంలో మార్చి నెలలో సమర్పించిన అఫిడవిట్ లో చాలా భాగం ఖాళీగా వదిలేశారనే చర్చ సాగింది. విశాఖ పట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చిన పాల్ కులం, మతం లాంటి వివరాలు రాయలేదని.. ఆఇదే క్రమంలో తన చేతిలో రూ.30 వేల క్యాష్ మాత్రమే ఉందని చెప్పి.. ఇతర ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించలేదు. గతంలో వందల కోట్లు ఆస్తిపాస్తులు ఉన్న కేఏ పాల్‌ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత తక్కువ ఆస్తులు చూపడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: