జగన్‌ ఏం మాయ చేస్తున్నాడో అర్థంకాక జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల ముఖ చిత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే పోటాపోటీగా సన్నివేశం ఉంది అనేది అంతా అంగీకరిస్తున్నారు. లోకల్ రీజనల్ సర్వేలు వెల్లువలా వస్తున్నాయి. ఈ సర్వేలు అన్నీ కూడా వైసీపీ టీడీపీ ల మధ్య తీవ్రమైన పోరు ఉందని స్పష్టం చేస్తున్నాయి. అంతే కాదు గెలిచిన పార్టీ ఓడిన పార్టీ మధ్య ఓట్ల షేర్ కూడా తక్కువ శాతంలో ఉండే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అన్నీ సర్వేలు అధ్యయనం చేసిన వారు మాత్రం అంత సులువుగా ఏపీ ఎన్నికలు ఉండవు అనే అభిప్రాయానికి వస్తున్నారు. అంతే కాదు ఈ సర్వేలను చూస్తే చివరి ఓటు పడే వరకు టెన్షన్ అలానే కొనసాగుతుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం అధికార వైసీపీ మళ్లీ తామే వస్తాం అని బలంగా నమ్ముతోంది.

అదే విధంగా టీడీపీ కూటమి కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.  తమ కూటమికి ఎదురు లేదని చెబుతోంది. ఈ విధంగా రెండు వైపులా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.  వాస్తవానికి ఓటరుకి డబ్బులు కావాలి.  దీంతో పాటు అభ్యర్థి మంచి వాడు అయి ఉండాలి.  అయితే ప్రచార సభల విషయానికొచ్చే సరికి.. జగన్ కన్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వెనుకపడ్డారేమో అనిపిస్తోంది.

ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు వైసీపీ, ఇటు ఎన్డీయే కూటమి పోటా పోటీగా సభలు నిర్వహిస్తున్నారు. జగన్ సిద్ధం సభలను చూసి.. చంద్రబాబు, పవన్ ల రోడ్ షోలు చూస్తే జనం పెద్దగా కనిపించడం లేదు. వీరు ఏమో నియోజకవర్గానికి ఒక ముఖ్య కేంద్రం చూసి సభలు పెడుతున్నారు. జగన్ ఏమో ఐదారు నియోజకవర్గాలు కలిపి సభలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎటు చూసినా జనసందోహమే కనిపిస్తోంది. ఈ జనాలను చూపెట్టి వీరంతా తమవైపే ఉన్నారనే భావన ప్రతిపక్షాలకు కలిగేలా జగన్ వ్యూహాలు పన్నుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: