రాయి రాజకీయం: చంద్రబాబుపై పెరుగుతున్న అనుమానాలు?

Chakravarthi Kalyan
కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ. దీనిని పొలిటికల్ స్టైల్ లో మార్చితే.. కాదేదీ రాజకీయ అవసరాలకు అనర్హం కూడా అని చెప్పవచ్చు. ఎందుకుంటే ఏపీలో ఓ రాయితో మొదలైన రాజకీయం ఇప్పుడు పీక్ స్టేజ్ లోకి వెళ్లింది. విజయవాడలో సీఎం జగన్ పై మొదలైన రాయి రాజకీయం.. తెనాలిలో పవన్ పై పడింది. ఆ తర్వాత చంద్రబాబు పర్యటనలో వచ్చి వాలింది.

ఇప్పుడు ఏపీలో చర్చంతా ఈ రాళ్ల దాడులపైనే నడుస్తోంది.  దీనిపై నేతలు స్పందించిన తీరు వివాదస్పదం అవుతోంది. ఒక మనిషిపై దాడి జరిగితే దానిని స్వార్థం కోసం అంటూ విమర్శించి తమలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తున్నారు.  ఏం జరిగినా.. ఎలా జరిగినా ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. దీనిని ప్రతిపక్ష పార్టీల నాయకులు బాధ్యతగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలి. ఆయనకు సంఘీభావం ప్రకటించాలి.

దేశ ప్రధాని మోదీ ఈ విషయంపై స్పందించిన తర్వాత కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించలేదు. పైగా ఈ నెపాన్ని అధికారులపై తెలివిగా నెట్టేశారు. ఆ తర్వాత పవన్ జగన్ ని పరామర్శించడం మానేసి…ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టారు. నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా.. తన వ్యంగ్యంగా స్పందించి.. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. తాజాగా ఈ రాయి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.

ఆదిలో దాడిని ఖండించిన చంద్రబాబు ఆ తర్వాత జగనే కావాలని చేయించుకున్నారు. ఇదంతా డ్రామాగా అభివర్ణించారు. సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు అని మండి పడ్డారు. ఇప్పుడు ఈ కేసు టీడీపీ నేత బోండా ఉమ మెడకు చుట్టుకుట్టుంది. వాస్తవానికి దీనికి చంద్రబాబుకి ఏం  సంబంధం ఉండకపోవచ్చు. ఎవరో కార్యకర్త లేదా పార్టీపై అభిమానం ఉన్నవారు చేస్తే దానిని చంద్రబాబు చేశారని ఆపాదించలేం. కానీ దీనిని సమర్థిస్తూ టీడీపీ నాయకులు.. వారికి అనుకూలంగా  చంద్రబాబు మాట్లాడుతుంటే లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: