హైదరాబాద్ ని 4 వేలకే కొందామనుకున్న హీరో.. ఎవరంటే.?

Pandrala Sravanthi
చాలామంది హీరోలు ఒక్కొక్క సినిమాకి కోట్ల కు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు.వచ్చిన రెమ్యూనరేషన్ తో భూములు,ఇండ్లు, స్థలాలు కొనుక్కుంటున్నారు. కానీ ఈ హీరో మాత్రం తనకి వచ్చిన 4000 తోనే హైదరాబాద్ సగాన్ని కొనేయాలనుకున్నారట. మరి ఆ హీరో ఎవరు..4వేల తోనే హైదరాబాద్ ఎలా కొనగలరు.. అది ఎలా అసాధ్యం అనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాలుగు వేల తో హైదరాబాద్ కొనాలి అనుకున్న నటుడు ఎవరో కాదు నాని.. అయితే ఈ విషయాన్ని తాజాగా తన అభిమానులతో పంచుకున్నారు.ఇక నాని మొదటి జీతం 4000..ఈ జీతం తీసుకోగానే నాని మొహంలో ఏదో తెలియని సంతోషం కనిపించిందట.

అంతేకాదు వచ్చిన జీతాన్ని జేబులో పెట్టుకొని రయ్యిమని బైక్ నడుపుకుంటూ హైదరాబాదులో రెంట్ కి ఉండే తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ నాలుగు వేల తో హైదరాబాద్ సగాన్ని కొనాలి అనే భావన నానిలో కలిగిందట.అయితే అప్పట్లో 4000 జీతమే నానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందట.ఇక ఈ జీతంతో హైదరాబాద్ ని కొనేయాలి అని నాని ఆలోచన చేశారు అంటే అప్పట్లో ఆయనకి మొదటి జీతం చూసి ఎంతగా సంతోషం కలిగిందో ఆయన మాటల్లో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సంవత్సరానికి 40, 50 కోట్లు సంపాదిస్తున్న కూడా నానికి అంత సంతోషం కలగడం లేదట.

కానీ తన మొదటి జీతం తీసుకున్న సందర్భంలో మాత్రం ఏదో తెలియని హ్యాపీనెస్ తన మొహంలో కనబడిందట.అలాగే నానికి స్నేహితులతో కలిసి సరదాగా గడపడం అంటే చాలా ఇష్టమట. అందుకే వీకెండ్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు టైం దొరుకుతుందా.. ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అని ప్రతి రోజు వేచి చూస్తూ ఉంటారట. ఇక నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీలో చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతోనే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారట. అంతేకాకుండా బలగం వేణుతో కూడా ఓ మూవీ అనుకున్నప్పటికీ అది ప్రస్తుతం వాయిదా పడ్డట్టు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: