పుష్ప 2: విడుదలకు ముందే పాన్ ఇండియా రికార్డులు?

Purushottham Vinay
ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప-దిరైజ్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. నిజానికి తెలుగులో పుష్పాకి భారీ అంచనాల వల్ల సరైన టాక్ రాలేదు. వసూళ్లు కూడా ఊహించినంత రాలేదు. అసలు పుష్ప హిట్ అయ్యిందంటే దానికి కారణం నార్త్ మార్కెట్. ఈ సినిమా మొత్తం వసూళ్లలో సగ భాగం నార్త్ మార్కెట్ నుంచే రాబట్టింది.అందుకే పుష్ప-2 మెయిన్ టార్గెట్  హిందీ మార్కెటే  అన్నది వాస్తవం. ఇక్కడ ఆడియన్స్ కంటే అక్కడి నుంచి ఎక్కువ ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఈ పాయింట్ క్యాష్ చేసుకొని మేకర్స్ నార్త్ లో తెలివిగా బిజినెస్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ హిందీ రైట్స్ ని అనిల్ తదాని 200 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద తీసుకున్నారనే వార్త కూడా వచ్చింది. కానీ ఈ ప్రచారాన్ని కూడా తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలు లేదు. అసలు పుష్ప  మొదటి భాగం బన్నీ ఎవరో సరిగ్గా తెలియకుండానే ఏకంగా 100 కోట్లకు పైగా అక్కడ నుంచి రాబట్టింది. దీంతో పుష్ప-2పై నార్త్ మార్కెట్ నుంచి ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.


ఇక్కడ ఆడియన్స్ కంటే అక్కడ ఆడియన్స్ లో చాలా ఎక్కువ ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. ఆ నమ్మకంతోనే అనీల్ తడాని ధైర్యంగా 200 కోట్లకు కండీషన్ల ప్రకారం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక పుష్ప 2 కనుక హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అదే సినిమా అక్కడ మార్కెట్ నుంచి ఖచ్చితంగా చాలా ఈజీగా 400 కోట్లకు పైగానే రాబడుతుంది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు కూడా ఆ రేంజ్ లో వసూలు చేశాయి.ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ సినిమా హిందీ రైట్స్ ని ఏకంగా అన్ని కోట్లకు కొన్నారా? అన్నది ఇప్పుడు నార్త్ ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా  నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమాలు ట్రైలర్ రిలీజ్ కావాలి. నార్త్ లో  ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలి. ఇక ఇదంతా జరిగిన తర్వాత అంచానలు ఇంకా రెట్టింపు అవుతాయి. మరి చూడాలి పుష్ప 2 ఫలితం ఎలా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: