రాయి ఎటాక్: జగన్ ను చంపడమే టార్గెట్.. విస్తుపోయే నిజాలు..!

Divya
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాయి ఎటాక్ హాట్ టాపిక్ గా మారుతోంది.. సీఎం జగన్ పైన దాడి చేసిన వ్యక్తిని పోలీసులు సైతం పట్టుకొని విచారణ చేపట్టగా అందులో కొన్ని విస్తుపోయే నిజాలు నిందితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

సీఎం జగన్ పైన దాడి కేసు విషయంలో రిమాండ్ రిపోర్టులో పోలీసుల సైతం విస్తుపోయే విషయాలు బయటపెట్టడం జరిగింది. సీఎం జగన్ పైనా దాడి చేసింది సతీష్ అనే వ్యక్తి అన్నట్లుగా పోలీస్ రిమాండ్ లో రిపోర్ట్ లో తెలియజేశారు. అయితే పోలీస్ రిమాండ్ రిపోర్టులో తెలిపిన సమాచారం ప్రకారం.. సీఎం జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకే ఒక పదునైన రాయితో దాడి చేసినట్లుగా తెలియజేశారు. కేవలం సీఎం జగన్ ని చంపాలని ఉద్దేశంతోనే అతడు ఇలా చేసినట్లుగా తెలియజేశారు. అందుకు అదును చూసి సీఎం జగన్ సున్నితమైన తల భాగంలో దాడి చేసినట్లుగా తెలియజేశారు. కరెక్టుగా 8 గంటల 4 నిమిషాల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో భాగంగా పాల్గొని దాడి చేశానని ఆ దాడికి సిమెంట్ కాంక్రీట్ రాయి ఉపయోగించానని తెలియజేసినట్లు రిపోర్టులో ఉన్నది.

అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకే సీఎం జగన్ పైన దాడి చేసిన నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడి యొక్క కదలికలను కూడా గుర్తించినట్లుగా ఆ తర్వాతే నిర్ధారించామని పోలీసులు తెలియజేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకే అన్ని ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేశామంటూ తెలియజేశారు. 17వ తారీకు నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసినట్లుగా తెలిపారు. అలాగే అతని మొబైల్ ని కూడా సీజ్ చేసినట్లుగా తెలిపారు. మరి ఈ విషయం అటు రాజకీయాలలో ఎలాంటి పరిణామాలను తీసుకువస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: