ప‌వ‌న్ బీ ' ఇన్ ' ఫామ్‌.. గెలిచేదెవ‌రు... ఓడేదెవ‌రు..?

RAMAKRISHNA S.S.
- జ‌గ‌న్‌, బాబు, బీజేపీ క‌న్నా ముందే బీఫామ్‌లిచ్చేసిన ప‌వ‌న్‌
- 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు సీట్ల‌లో 50 % ఖ‌చ్చితంగా విన్నింగ్ ఛాన్స్‌
- కోస్తా, గోదావ‌రి బెల్ట్‌లో ప‌వ‌న్ పార్టీకి మెజార్టీ సీట్లు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో పోటీ చేసే అన్నీ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల క‌న్నా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుగానే త‌న పార్టీ నుంచి పోటీ చేస్తోన్న అభ్య‌ర్థుల‌కు బీ ఫామ్‌లు ఇచ్చేశారు. నిన్న శ్రీరామ‌న‌వ‌మి రోజునే ప‌వ‌న్ మ్యాండెట్లు ఇచ్చేశారు. ప‌వ‌న్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల్లో ఎవ‌రి ప‌రిస్థితి ఏంటి ?  ఎవ‌రికి జ‌య‌ప‌జ‌యాలు ఉన్నాయో ఇండియా హెరాల్డ్ స‌ర్వేల్లో ఏం తేలిందో చూద్దాం.
1)  పెందుర్తి - పంచకర్ల రమేశ్ బాబు
గ‌తంలో పెందుర్తిలో ప్ర‌జారాజ్యం నుంచి య‌ల‌మంచిలిలో టీడీపీ నుంచి గెలిచిన పంచ‌కర్ల ఈ సారి కూట‌మి ప్ర‌భావంతో పెందుర్తిలో బ‌లంగా ఉన్నారు. ఇక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి స‌హ‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా లేదు. అయినా కూడా కూట‌మి బ‌లంగా ఉండ‌డంతో పెందుర్తిలో పంచ‌క‌ర్ల‌కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
2) ఎలమంచిలి - సుందరపు విజయకుమార్‌
ఎల‌మంచిలిలో కూట‌మి ప్ర‌భావం బ‌లంగా ఉంది. టీడీపీ స‌పోర్ట్ విజ‌య్‌కు గ‌ట్టిగా ఉండ‌డంతో ఆయ‌న కూడా హెరాహెరీ పోరులో ఎడ్జ్‌లో బ‌య‌ట ప‌డే ఛాన్సులే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నాయి.
3) విశాఖ దక్షిణం - వంశీకృష్ణ యాదవ్‌
నిన్నటి వ‌ర‌కు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ విశాఖ సౌత్‌లో జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఉన్నారు. ఆయ‌న‌పై వైసీపీ నుంచి పోటీలో ఉన్న వాసుప‌ల్లి గ‌ణేష్ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచి ఈ సారి వైసీపీ మ్యాండేట్‌పై పోటీ చేస్తున్నారు. వాసుప‌ల్లి మాస్ లీడ‌ర్ కావ‌డం.. ఇటు తూర్పులో ప‌ట్టున్న వంశీ ఇక్క‌డ పోటీలో ఉండ‌డంతో ఫ‌లితం తేలే వ‌ర‌కు ఎవ‌రు గెలుస్తార‌న్న‌ది అనుమాన‌మే..!

4)   తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
గ‌త ఎన్నిక‌ల్లోనే జ‌న‌సేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి ఈ సారి కూట‌మిలో మూడు పార్టీల స‌పోర్ట్‌తో పోటీలో ఉన్నారు. అటు మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఏటికి ఎదురీదుతున్నారు. జ‌న‌సేన‌కు బాగా ఛాన్సులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌స్ట్ వ‌రుస‌లో తాడేప‌ల్లిగూడెం ఉంది.
5) ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
జ‌న‌సేన క్ష‌త్రియుల‌కు ఇచ్చిన ఒకే ఒక సీటు ఇది. టీడీపీ ఏలూరు జిల్లా అధ్య‌క్షులు గ‌న్ని వీరాంజ‌నేయులుకు ఇది సొంత సీటు. ముందు కాస్త టైట్‌లో ఉన్న టీడీపీ స‌పోర్ట్‌తో ధ‌ర్మ‌రాజు గెలుపు దిశ‌గా వెళుతున్నారు.
6) నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
ప‌వ‌న్‌కు ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త ఎన్నిక‌ల్లోనే జ‌న‌సేన కేవ‌లం 5 వేల ఓట్ల‌తో ఓడింది. ఈ సారి కూట‌మి పార్టీల ఎఫెక్ట్‌తో మంచి మెజార్టీతో ఇక్క‌డ జ‌న‌సేన గెలుపు ఖాయ‌మైంది.
7) భీమవరం - పులపర్తి రామాంజనేయులు
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ స్వ‌యంగా పోటీ చేసిన సీటు ఇది. ఈ సారి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జ‌న‌సేన మ్యాండేట్ మీద పోటీలో ఉన్నారు. గ‌ట్టి పోటీ ఉన్నా జ‌న‌సేన‌కే మొగ్గు ఉంది.

8) రాజోలు(ఎస్సీ) - దేవవరప్రసాద్‌
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలిచిన ఏకైక సీటు ఇది. ఈ సారి మాజీ ఐఏఎస్ దేవ‌వ‌ర‌ప్ర‌సాద్ ఇక్క‌డ జ‌న‌సేన పోటీలో ఉన్నారు. జ‌న‌సేన ఖ‌చ్చితంగా గెలిచే సీట్ల‌లో ఇదొక‌టి.
9) తిరుపతి - ఆరణి శ్రీనివాసులు
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే పార్టి మారి ఈ సారి తిరుప‌తి జ‌న‌సేన క్యాండెట్‌గా ఉన్నారు. వైసీపీ నుంచి తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ భూమ‌న అభిన‌య్ పోటీలో ఉన్నారు. కూట‌మి బ‌లంగా ఉన్నా క్యాండెట్ నాన్ లోక‌ల్ కావ‌డం మైన‌స్‌. గ‌ట్టి పోటీ ఉంది.
10) నిడదవోలు - కందుల దుర్గేష్
రాజ‌మండ్రి రూర‌ల్ సీటు ఆశించిన కందుల దుర్గేష్‌ను నిడ‌ద‌వోలుకు పంపారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు తోడు.. టీడీపీ వాళ్లు బ‌లంగా స‌పోర్ట్ చేస్తుండ‌డంతో ఇక్క‌డ జ‌న‌సేన‌కు ఎడ్జ్ ఉంది.
11) కాకినాడ రూర‌ల్ - పంతం నానాజీ
పంతం నానాజీకి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి ఉంది. అయితే వైసీపీ నుంచి మాజీ మంత్రి క‌న్న‌బాబు ఉన్నారు. కూట‌మి ఓట్లు స‌రిగ్గా ట్రాన్స్‌ఫ‌ర్ అయితే బంప‌ర్ మెజార్టీతో ఇక్క‌డ నానాజీ గెలుస్తారు.

12) నెల్లిమర్ల  - లోకం మాధవి
టీడీపీకి ఇస్తే వ‌న్‌సైడ్‌గా గెలిచే సీటు ఇది. లోకం మాధ‌వికి క్యాస్ట్ ఈక్వేష‌న్ అంత బ‌లంగా లేదు. వైసీపీ క్యాండెట్‌కు మంత్రి బొత్స సోద‌రుడు అప్ప‌ల న‌ర‌స‌య్య వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని టాక్‌. ఏదేమైనా ఇప్ప‌ట‌కీ అయితే వైసీపీకే ఎడ్జ్ ఉంది.
13) తెనాలి - నాదెండ్ల మ‌నోహ‌ర్‌
టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆల‌పాటి రాజా త్యాగం చేసిన సీటులో నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తున్నారు. మ‌నోహ‌ర్‌కు మంచి నేమ్ ఉన్నా.. టీడీపీ వాళ్లు ఆయ‌న‌కు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తార‌న్న‌దే చూడాలి. రాజా టీం మ‌న‌స్ఫూర్తిగా స‌పోర్ట్ చేస్తే త‌ప్పా జ‌న‌సేన గెల‌వ‌లేని సీటు ఇది.
14) పిఠాపురం - ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ఎంత పోటీ ఉంద‌ని పైకి ఎవ‌రు చెప్పినా పవ‌న్ ఇక్క‌డ నుంచి మంచి మెజార్టీతో విజ‌యం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు.
15) అవ‌నిగ‌డ్డ - మండ‌లి బుద్ద ప్ర‌సాద్‌
కాంగ్రెస్‌లో మాజీ మంత్రి.. త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయిన బుద్ధ ప్ర‌సాద్ ఇప్పుడు అనూహ్యంగా జ‌న‌సేన అభ్య‌ర్థి అయ్యారు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌, కాపులు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం.. క‌మ్మ‌లు, బీసీలు కూడా క‌లిసొస్తున్నారు. ప్ర‌స్తుతానికి జ‌న‌సేన‌కే ఎడ్జ్ ఉన్న సీటు ఇది.

16) రాజా న‌గ‌రం - బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ‌
గోదావ‌రి ఒడ్డున న‌రాలు తెగే ఉత్కంఠ రేపుతోన్న సీటు ఇది. బ‌త్తుల ఫుల్‌మాస్‌.. వైసీపీ రాజా ఫుల్ క్లాస్‌.. టీడీపీ క్యాండెట్ బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రి, టీడీపీ కేడ‌ర్ మ‌న‌స్ఫూర్తిగా స‌హ‌క‌రిస్తుండ‌డంతో జ‌న‌సేన‌కు ఎడ్జ్ వ‌చ్చేసింది.
17) పి. గ‌న్న‌వ‌రం(ఎస్సీ) - గిడ్డి స‌త్య‌నారాయ‌ణ‌
టీడీపీ మ‌హాసేన రాజేష్‌ను త‌ప్పించ‌డంతో ఈ సీటు జ‌న‌సేన‌కు వ‌చ్చింది. కూట‌మి బ‌లం, ప‌వ‌న్ ఫ్యాన్స్ అన్నీ క‌లిసి ఈ సీటును జ‌న‌సేన ఖాతాలో వేస్తున్నాయి. ఇక్క‌డ వైసీపీ క్యాండెట్ కూడా మారే అవ‌కాశం ఉంది.
18) పోల‌వ‌రం(ఎస్టీ) - చిర్రి బాల‌రాజు
జ‌న‌సేన ఏదో రెండు ఎస్టీ సీట్లు తీసుకోవాల‌నే పోల‌వ‌రం తీసుకుని పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. నిజంగా ఇక్క‌డ టీడీపీ పోటీ చేస్తే గెలిచే సీటు... జ‌న‌సేన ఖ‌చ్చితంగా ఓడే సీట్ల‌లో పోల‌వ‌రం ప‌స్ట్ లిస్టులో ఉందంటున్నారు.
19) రైల్వే కోడూరు(ఎస్సీ) - య‌న‌మ‌ల భాస్క‌ర‌రావు
ఇక్క‌డ జ‌న‌సేన క్యాండెట్‌ను మార్చారు. టీడీపీకి ఇక్క‌డ బ‌లంగా ఉండ‌డంతో వాళ్ల‌కు అనుకూల‌మైన వ్య‌క్తికి సీటు ఇచ్చినా... క‌డ‌ప జిల్లాలోనే కూట‌మి బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అయినా గెలిచే వ‌ర‌కు జ‌న‌సేన గెలుస్తుంద‌ని చెప్ప‌లేం.

20) అన‌కాప‌ల్లి - కొణ‌తాల రామ‌కృష్ణ‌
సీనియ‌ర్ నేత కొణ‌తాల 2009 త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. అన‌కాప‌ల్లిలో ఆయ‌న గ‌తంలో గెలిచారు. కూట‌మి బ‌లంగా ఉంది. జ‌న‌సేన‌కు స్వ‌ల్ప ఆధిక‌త్య ఉంది.  
21) పాల‌కొండ(ఎస్టీ) - నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఓడిపోయిన జ‌య‌కృష్ణ ఈ రోజు జ‌న‌సేన క్యాండెట్ అయ్యారు. ఇక్క‌డ వైసీపీ గ‌త రెండు ఎన్నిక‌ల్లో గెలిచినా ఈ సారి గ‌ట్టి పోటీ ఉంటుందే త‌ప్పా గెలుపు వైసీపీదే అని అంచ‌నా.

ఎంపీ సీట్లు
1) మ‌చిలీప‌ట్నం - వ‌ల్ల‌భ‌నేని బాల శౌరి
జ‌న‌సేన నుంచి తొలి ఎంపీగా బాల‌శౌరి రికార్డుల్లోకి ఎక్క‌బోతున్నారు. పార్ల‌మెంటు ప‌రిధిలో మెజార్టీ సీట్ల‌లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌బోతున్నారు. ఇక్క‌డ వైసీపీ ఎంపీ క్యాండెట్ ఖ‌చ్చితంగా వీకే.
2) కాకినాడ - ఉద‌య్ శ్రీనివాస్
రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన తెంగెళ్ల ఉద‌య్ శ్రీనివాస్ పిఠాపురం సీటు ఆశించారు. అయితే ప‌వ‌న్ అక్క‌డ పోటీ చేస్తుండ‌డంతో ఉద‌య్ కాకినాడ పార్ల‌మెంటు నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ క్యాండెట్ సునీల్ వ‌రుస‌గా మూడుసార్లు ఓడిన సానుభూతి ఉన్నా కూడా ఉద‌య్ కూట‌మి ప్ర‌భావంతో గ‌ట్టెక్కేయ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: