పార్టీ అంతరించిపోతుందని.. కేసిఆర్ కు అర్థమైందా?

praveen
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇక బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుంచి ఇక తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా మారిపోయాయి. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  ఈ వేడి డబుల్ అయింది అని చెప్పాలి. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిని కూడా కేసీఆర్ గులాబీ గూటికి చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ ఇదే చేస్తున్నారు. ఎంతోమంది కీలక నేతలను ఇప్పటికే హస్తం పార్టీలో చేర్చుకున్నారు.

 ఇక మరికొంతమంది కారు పార్టీని వదిలి హస్తం గూటికి వచ్చేందుకు అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి అనేవి ప్రచారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో జరుగుతుంది. అయితే బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా కొనసాగిన కడియం శ్రీహరి, కేకే లాంటి నేతలు.. కారు పార్టీని వదలడం మరింత సంచలనంగా మారిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య  పార్టీలో మిగిలి ఉన్న నేతలలో విశ్వాసం నింపి ఇక కారు పార్టీని అంటిపెట్టుకునే విధంగా కేసిఆర్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

 అయితే ఇటీవల ఇదే విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వెళ్తారు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుంది అనే భయం ఆ పార్టీ అధినేత కేసిఆర్ లో మొదలైంది. గతంలో కేసీఆర్ మెజారిటీ స్థానాలలో గెలిచి కూడా మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బలవంతంగా పార్టీలో చేర్చుకోవట్లేదు. ఆ పార్టీలో ఇమడలేక వాళ్లే బయటికి వచ్చి కాంగ్రెస్కు పార్టీలో చేరుతున్నారు అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: