కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయో.. ముందే చెప్పేసిన కేసిఆర్?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థులను ఇప్పటికే బరిలోకి దింపాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు తమన గెలిపిస్తే ఏం చేస్తాం అనే విషయంపై హామీల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కారు పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూనే ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొంతమంది కీలక నేతలు గులాబీ పార్టీ నుంచి హస్తం గూటికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితులను నేపథ్యంలో ఉన్న మిగతా నేతలైన పార్టీని అంటిపెట్టుకొని ఉండాలంటే.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకున్న కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. వరుసగా సమావేశాల్లో పాల్గొంటూ ప్రసంగాలు ఇస్తున్నారు కేసీఆర్.

 ఇకపోతే ఇటీవలే చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే విషయంపై ముందే జోష్యం చెప్పారు కెసిఆర్. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు వస్తాయని అంతకంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు అని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి అంటూ కేసిఆర్ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో భయం చూస్తే కనీసం ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కూలిపోతుంది అన్న విషయం అర్థమవుతుంది అంటూ కేసిఆర్ విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: