2019లో జగన్ సీఎం కావడానికి చంద్రబాబే కారణమా.. అలా సక్సెస్ అయ్యారా?

Reddy P Rajasekhar
2019 ఏపీ ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలలో 22 ఎంపీ స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు సైతం భావిస్తున్నారు. 2014 - 2019 మధ్య చంద్రబాబు పాలనలో ఏపీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు విషయంలో టీడీపీ ఫెయిల్ కావడం వైసీపీకి ప్లస్ అయింది.
 
2014 ఎన్నికల సమయంలో వందల సంఖ్యలో హామీలను ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ హామీలలో మెజారిటీ హామీలను 2019 ఎన్నికలకు ముందు చివరి ఆరు నెలలు మాత్రమే అమలు చేశాడు. 2019 ఎన్నికల సమయానికి చంద్రబాబుపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పెరిగిందంటే కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే విధంగా అప్పట్లో ప్రచారం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు అదిరిపోయే హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఏపీ ప్రజలకు చుక్కలు చూపించారు.
 
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినా అమరావతిని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాబు పాలనలో అవినీతి ఎక్కువగా జరిగిందని ప్రజలు నమ్మారు. రైతులకు ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తూతూమంత్రంగా కేవలం మూడు విడతల రుణమాఫీ మాత్రమే చేసి రైతుల్లో వ్యతిరేకత పెంచుకున్నారు.
 
మరోవైపు జగన్ నవరత్నాల హామీలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువై 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే చంద్రబాబు చేస్తున్న తప్పులను జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా బాబు పాలన, జగన్ పాలన మధ్య తేడా చూసిన ప్రజలు జగన్ పాలన బెటర్ అని ఫీలవుతున్నారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తానని జనంలో జగన్ నమ్మకం కల్పించడం వైసీపీకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. బాబు మైనస్ లను ప్లస్ గా మార్చుకుంటూ జగన్ ముందుకెళ్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: